ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు పోలవరం రాక
పోలవరం రూరల్ : పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించేందుకు ఈ నెల 22న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లాకు రానున్నారు.
పోలవరం రూరల్ : పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించేందుకు ఈ నెల 22న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లాకు రానున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో యంత్రాంగం బందోబస్తు ఏర్పాట్లు చేపట్టింది. శనివారం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాన్ని ఎస్పీ భాస్కర్‌భూషణ్, జాయింట్ కలెక్టర్ పి.కోటేశ్వరరావు సందర్శించి బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ముఖ్యమంత్రి సోమవారం ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో జరుగుతున్న పనులను పరిశీలించి సంబంధిత అధికారులు, కాంట్రాక్ట్ ఏజెన్సీ ప్రతినిధులతో రివ్యూ సమావేశం జరపనున్నట్టు ఇంజనీరింగ్ అధికారులు చెప్పారు. ప్రాజెక్టు ఎస్‌ఈ వీఎస్ రమేష్‌బాబు, ఆర్డీవో ఎస్.లవన్న, పోలవరం డీఎస్పీ ఏటీవీ రవికుమార్ ఉన్నారు.