అమ్మవారి ఆలయం వద్ద ముమ్మర తనిఖీలు | checking at padmavathi temple | Sakshi
Sakshi News home page

అమ్మవారి ఆలయం వద్ద ముమ్మర తనిఖీలు

Aug 13 2016 8:04 PM | Updated on Sep 4 2017 9:08 AM

తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయం తనిఖీలు నిర్వహిస్తున్న దృశ్యం

తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయం తనిఖీలు నిర్వహిస్తున్న దృశ్యం

స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యగా పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు.

 
తిరుచానూరు : స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యగా పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయ పరిసరాల్లోని దుకాణాలు, వాణిజ్య సముదాయాల వద్ద తిరుచానూరు సీఐ కేవీ.సురేంద్రనాయుడు, ఎస్‌ఐ చిరంజీవి ఆధ్వర్యంలో బాంబు, డాగ్‌ స్క్వాడ్‌ సిబ్బంది తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల, తిరుచానూరు తదితర ఆలయాలకు తీవ్రవాదుల ముప్పు ఉన్న నేపథ్యంలో తిరుపతి అర్బన్‌ ఎస్పీ ఆర్‌.జయలక్ష్మి ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. ఆలయ పరిసరాల్లో అనుమానితులు కనబడినా, బ్యాగులు వంటివి గుర్తించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని దుకాణాదారులకు ఆయన విజ్ఞప్తి చేశారు.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement