చాపమ్మవ్వ కిడ్నాప్‌ | chapammavva kidnap | Sakshi
Sakshi News home page

చాపమ్మవ్వ కిడ్నాప్‌

Sep 14 2016 12:40 AM | Updated on Sep 4 2017 1:21 PM

చాపమ్మవ్వ కిడ్నాప్‌

చాపమ్మవ్వ కిడ్నాప్‌

కౌతాళం: ఆంధ్ర–కర్ణాటక సరిహద్దులోని బాపురం గ్రామ పొలిమేరలో కొలువుదీరిన చాపమ్మవ్వను మంగళవారం ఆమె కుమారులు కిడ్నాప్‌ చేశారు. దాదాపు 10 సంవత్సరాలుగా చాపమ్మవ్వ ఆంధ్ర, కర్ణాటక భక్తులకు ఆరాధ్య దైవంగా నిత్యం పూజలందుకుంటుంది.

కౌతాళం: ఆంధ్ర–కర్ణాటక సరిహద్దులోని బాపురం గ్రామ పొలిమేరలో కొలువుదీరిన చాపమ్మవ్వను మంగళవారం ఆమె కుమారులు కిడ్నాప్‌ చేశారు. దాదాపు 10 సంవత్సరాలుగా చాపమ్మవ్వ ఆంధ్ర, కర్ణాటక భక్తులకు ఆరాధ్య దైవంగా నిత్యం పూజలందుకుంటుంది. ఇటీవల చాపమ్మవ్వ దగ్గర ఉండే బాపురం గ్రామస్తులకు, ఆమె కుమారులకు మనస్పర్థలు రావడంతో తమ తల్లిని ఎలాగైనా తమ సొంత గ్రామం కర్ణాటకలోని గంగావతి నియోజకవర్గం కాటిగె గ్రామానికి తీసుకెళ్లాలని పథకం వేశారు. ఈ మేరకు మంగళవారం చాపమ్మవ్వను బహిర్భూమికి తీసుకెళ్తానని చెప్పి అప్పటికే అర కిలోమీటరు దూరంలో ఉంచిన జీపు వద్దకు తీసుకెళ్లి అక్కడి నుంచి కిడ్నాప్‌ చేశారు. కర్ణాటకలోని హచ్చోళ్లి పోలీసు స్టేష్‌న్‌లో బాపురం గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. చాపమ్మవ్వను ఎలాగైనా గ్రామానికి తీసుకొచ్చేలా ప్రయత్నం చేస్తున్నారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement