గ్యాస్, పింఛన్ల పంపిణీని పరిశీలించిన కేంద్ర బృందం | central team visits guntupalli | Sakshi
Sakshi News home page

గ్యాస్, పింఛన్ల పంపిణీని పరిశీలించిన కేంద్ర బృందం

Dec 13 2016 11:03 PM | Updated on Sep 4 2017 10:38 PM

గ్యాస్, పింఛన్ల పంపిణీని పరిశీలించిన కేంద్ర బృందం

గ్యాస్, పింఛన్ల పంపిణీని పరిశీలించిన కేంద్ర బృందం

గ్యాస్‌ సిలిండర్లు, పింఛన్ల పంపిణీ విధానాలను కేంద్ర బృందం సభ్యులు మంగళవారం పరిశీలించారు. కొండపల్లిలోని శ్రీలక్ష్మీబాలాజీ గ్యాస్‌ ఏజెన్సీస్‌ ద్వారా వినియోగదారులకు గ్యాస్‌ పంపిణీ జరిగే విధానాన్ని తెలుసుకున్నారు.

కొండపల్లి(ఇబ్రహీంపట్నం): గ్యాస్‌ సిలిండర్లు, పింఛన్ల పంపిణీ విధానాలను కేంద్ర బృందం సభ్యులు మంగళవారం పరిశీలించారు. కొండపల్లిలోని శ్రీలక్ష్మీబాలాజీ గ్యాస్‌ ఏజెన్సీస్‌ ద్వారా వినియోగదారులకు గ్యాస్‌ పంపిణీ జరిగే విధానాన్ని తెలుసుకున్నారు. గ్యాస్‌ బుకింగ్‌ చేసే పద్ధతి నుంచి వినియోగదారుడి ఇంటికి సరఫరా చేసే వరకు క్షేత్రస్థాయిలో జరుగుతున్న ప్రక్రియపై ఆరా తీశారు. గ్యాస్‌ సరఫరాలో ఆధార్‌ నమోదు ప్రాధాన్యతను తెలుసుకున్నారు. అనంతరం గుంటుపల్లి గ్రామంలో వృద్ధులకు సామాజిక పింఛన్ల పంపిణీ ప్రక్రియను పరిశీలించారు. బ్యాంకింగ్‌ కరస్పాండెంట్లు అమలు చేస్తున్న ఆన్‌లైన్‌ విధానాన్ని పరిశీలించారు. వృద్ధులు, వితంతువులకు పింఛన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాసరెడ్డి, ఆర్‌ఐ వేమూరి మానస, సర్పంచి దొప్పల రమణ, వీఆర్‌వోలు రమేష్, అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement