బ్యాంకు వద్ద నగదు చోరీ | Sakshi
Sakshi News home page

బ్యాంకు వద్ద నగదు చోరీ

Published Wed, Feb 8 2017 9:47 PM

cash theft at bank in peddavadagur

పెద్దవడుగూరు (తాడిపత్రి) : పెద్దవడుగూరులోని ఆంధ్రా బ్యాంకు అవరణలో కాశేపల్లికి చెందిన కూళ్లాయిరెడ్డి అనే ఖాతాదారుడికి చెందిన రూ.14 వేల నగదు బుధవారం చోరీకి గురైంది. తన ఖాతా నుంచి రూ.24 వేలు డ్రా చేయగా రూ.2 వేల నోట్లను ఎంచుకుని జేబులో ఉంచుకున్నారు. మిగిలిన రూ.100 నోట్లను లెక్కిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు రూ.14 వేలు నగదును చోరీ చేసినట్లు బాధితుడు పోలీసులు, బ్యాంక్‌ అధికారులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. నెల రోజుల వ్యవధిలో రెండుసార్లు ఖాతాదారుల నగదు చోరీకి గురవడం ఆందోళన కలిగిస్తోంది.

Advertisement
 
Advertisement
 
Advertisement