
తుని ఘటనలో కేసులు ఎత్తేయం
తుని ఘటనలో కేసులను ఎత్తేయడం సాధ్యంకాదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు చెప్పారు.
విజయవాడ: తుని ఘటనలో కేసులను ఎత్తేయడం సాధ్యంకాదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు చెప్పారు. సీఐడీ విచారణ ఆపుతామని ప్రభుత్వం తరపున ప్రకటన చేయలేదని, సీఐడీ విచారణ కొనసాగుతుందని వెల్లడించారు. కాపులకు రిజర్వేషన్ల అమలుకు సాంకేతిక ఇబ్బందులున్నాయని ఆయన చెప్పారు. కాపు నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం దీక్ష చేపట్టడం దుందుడుకు చర్యని అన్నారు. మెగాస్టార్ చిరంజీవి కాపుల పాలిట దగాస్టార్ అని విమర్శించారు.
తూర్పుగోదావరి జిల్లా తునిలో కాపు గర్జన సభ సందర్భంగా జరిగిన అల్లర్లపై సీఐడీ విచారణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తుని ఘటనకు సంబంధించి ఇప్పటివరకు 13 మందిని అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో తుని ఘటనలో అరెస్ట్ చేసిన వారిని విడుదల చేసి, కేసులు ఎత్తివేయాలని ముద్రగడ పద్మనాభం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు.