చెరుకులపాడు గ్రామంలో శుక్రవారం జరిగిన టీడీపీ దౌర్జన్య కాండపై పోలీసులు ఇరువర్గాలపై కేసులు నమోదు చేశారు.
చెరుకులపాడు ఘటనపై కేసులు నమోదు
Oct 2 2016 12:24 AM | Updated on Aug 21 2018 5:54 PM
వెల్దుర్తి రూరల్: చెరుకులపాడు గ్రామంలో శుక్రవారం జరిగిన టీడీపీ దౌర్జన్య కాండపై పోలీసులు ఇరువర్గాలపై కేసులు నమోదు చేశారు. స్కార్పియో వాహనాన్ని ధ్వంసం చేశారని నారాయణరెడ్డి వర్గీయుడు శేషు ఇచ్చిన ఫిర్యాదు మేరకు టీడీపీ వర్గీయులు పెద్దయ్య, నాగరాజు, రామనాయుడుపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తులసీనాగప్రసాద్ శనివారం తెలిపారు. టీడీపీ వర్గీయుడు వీరాంజనేయులు తనపై దాడి చేశారనే ఫిర్యాదు మేరకు నారాయణరెడ్డి వర్గీయులు శేషు, మల్లయ్య, లింగన్న, కొమ్ము మల్లయ్య, మాదన్న, రత్నంపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ చెప్పారు.
Advertisement
Advertisement