రైల్వే స్టేషన్‌లో 11 మంది బాలికల పట్టివేత | Capture for 11 girls at the railway station | Sakshi
Sakshi News home page

రైల్వే స్టేషన్‌లో 11 మంది బాలికల పట్టివేత

Jul 27 2016 4:21 PM | Updated on Sep 4 2017 6:35 AM

వైఎస్సార్ జిల్లాతోపాటు పక్కనున్న క ర్నూలుకు చెందిన 11 మంది బాలికలను కడప రైల్వే పోలీసులు పట్టుకుని బాలికల సంర క్షణాలయానికి తరలించారు.

వైఎస్సార్ జిల్లాతోపాటు పక్కనున్న క ర్నూలుకు చెందిన 11 మంది బాలికలను కడప రైల్వే పోలీసులు పట్టుకుని బాలికల సంర క్షణాలయానికి తరలించారు. వీరందరినీ చెన్నైకి అక్రమంగా తీసుకెళ్తున్నట్లు అందిన సమాచారం మేరకు ఐసీడీఎస్ అధికారులు, పోలీసులు బుధవారం వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ బాలికలంతా 13-16 ఏళ్ల వారే కావటం గమనార్హం. తాము చెన్నైలోకి దుస్తుల కంపెనీలో ఉద్యోగాల కోసం వెళ్తున్నట్లు వారు చెబుతున్నారు. వారు చెప్పిన వివరాల మేరకు చెన్నైలోని కంపెనీలను సంప్రదించగా అలాంటిదేమీ లేదని వారన్నట్లు సమాచారం.బాలికల తండ్రులు, సంబంధీకులుగా చెబుతున్న 10 మందిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement