రేపు ఎస్‌ఆర్‌ఐటీలో క్యాంపస్‌ డ్రైవ్‌ | campus drive in srit on 5th | Sakshi
Sakshi News home page

రేపు ఎస్‌ఆర్‌ఐటీలో క్యాంపస్‌ డ్రైవ్‌

Sep 3 2017 10:39 PM | Updated on Sep 12 2017 1:46 AM

బుక్కరాయసముద్రం: మండల పరిధిలోని రోటరీపురంలో ఉన్న ఎస్‌ఆర్‌ఐటీ ఇంజినీరింగ్‌ కశాలలో ఈ నెల 5వ తేదీ షిరిడిసాయి ఎలక్ట్రికల్స్‌ సంస్థ వారు క్యాంపస్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నట్లు టీపీఓ రంజిత్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

బుక్కరాయసముద్రం: మండల పరిధిలోని రోటరీపురంలో ఉన్న ఎస్‌ఆర్‌ఐటీ ఇంజినీరింగ్‌ కశాలలో ఈ నెల 5వ తేదీ షిరిడిసాయి ఎలక్ట్రికల్స్‌ సంస్థ వారు క్యాంపస్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నట్లు టీపీఓ రంజిత్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ క్యాంపస్‌ డ్రైవ్‌కు ఈఈఈ, మెకానికల్‌ విభాగాల్లో 60 శాతం ఉత్తీర్ణత సాధించిన పాలిటెక్నికల్‌ విద్యార్థులు అర్హులన్నారు. పాల్గొనదలచినవారు తమ రెజూం, మార్కుల జాబితాలు తీసుకుని ఉదయం 9 గంటలకు ఎస్‌ఆర్‌ఐటీ కళాశాలకు రావాలన్నారు. ఉద్యోగాలు సాధించిన విద్యార్థులకు ఏడాదికి రూ.1.20 - 1.50 లక్షలు వేతనం ఉంటుందన్నారు. ఉద్యోగాలు సాధించిన విద్యార్థులు వైఎస్సార్‌ జిల్లాలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుందన్నారు. వివరాలకు 95052 83026, 95052 83037 నెంబర్లలో సంప్రదించి పేర్లు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement