పదహారో నంబరు జాతీయ రహదారిపై మూలస్థాన అగ్రహారం వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఈ ప్రమాదంలో అదుపు తప్పిన బస్సు డివెడర్‌ను ఢీకొట్టి అవతలి వైపునకు వెళ్లిపోయి నిలిచిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో ఆ
వోల్వో బస్సు ఢీకొని ఇద్దరు మృతి
Dec 14 2016 12:10 AM | Updated on Sep 4 2017 10:38 PM
ఆలమూరు :
పదహారో నంబరు జాతీయ రహదారిపై మూలస్థాన అగ్రహారం వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఈ ప్రమాదంలో అదుపు తప్పిన బస్సు డివెడర్‌ను ఢీకొట్టి అవతలి వైపునకు వెళ్లిపోయి నిలిచిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో ఆ బస్సులోని 40 మంది ప్రయాణికులు క్షేమంగా బయట పడ్డారు. ఆలమూరు ఎస్సై పి.దొరరాజు కథనం ప్రకారం హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళుతున్న ప్రైవేటు ట్రావెల్స్‌కు చెందిన బస్సు స్థానిక బస్టాండు సమీపంలోని డివైడర్ వచ్చేసరికి ద్విచక్ర వాహనంపై రోడ్డు క్రాస్ చేస్తున్న నల్లా శ్రీను (45)ను, ఆ పక్కనే నిలిచి ఉన్న బిక్కవోలు శ్రీరాములు (65)ను వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో శ్రీరాములు అక్కడి కక్కడే మృతి చెందగా శ్రీనును ఎ¯ŒSహెచ్–16 అంబులె¯Œ్సలో రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతులిద్దరూ మూలస్థాన అగ్రహారం గ్రామస్తులే. మితి మీరిన వేగంతో బస్సు నడపటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఎస్సై దొరరాజు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement