చెరువుకు గండి.. ఇళ్లు నేలమట్టం | break in suraka vandla palli pond | Sakshi
Sakshi News home page

చెరువుకు గండి.. ఇళ్లు నేలమట్టం

Jun 21 2016 1:32 PM | Updated on Sep 17 2018 8:02 PM

వైఎస్సార్ జిల్లా రామాపురం మండలం సురకావాండ్లపల్లె గ్రామ చెరువుకు మంగళవారం గండిపడింది.

రామాపురం: వైఎస్సార్ జిల్లా రామాపురం మండలం సురకావాండ్లపల్లె గ్రామ చెరువుకు మంగళవారం గండిపడింది. వరద నీరు ఒక్కసారిగా సమీపంలోని ఇళ్లను ముచ్చెత్తాయి. సుమారు పది ఇళ్లు నేలమట్టం అయ్యాయి. ఇంకా కొన్ని ఇళ్లు జల దిగ్బంధంలోనే ఉన్నాయి. రైతులు ఇళ్లలో ఉంచుకున్న ధాన్యం తదితర సామగ్రి అంతా నీటిపాలైంది. సుమారు రూ.15 లక్షల మేర నష్టం వాటిల్లిందని చెబుతున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement