తప్పిపోయిన బుద్ధిమాంద్య విద్యార్థి | brain lost student missing in bathalapalli | Sakshi
Sakshi News home page

తప్పిపోయిన బుద్ధిమాంద్య విద్యార్థి

Oct 25 2016 10:22 PM | Updated on Sep 4 2017 6:17 PM

మండల కేంద్రంలోని ఆర్డీటీ బుద్ధిమాంద్య మనోవికాస కేంద్రంలో బుద్ధిమాంద్య విద్యార్థి తప్పిపోయినట్లు సిబ్బంది మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

బత్తలపల్లి : మండల కేంద్రంలోని ఆర్డీటీ బుద్ధిమాంద్య మనోవికాస కేంద్రంలో బుద్ధిమాంద్య విద్యార్థి తప్పిపోయినట్లు సిబ్బంది మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. వజ్రకరూరు మండలం కమలపాడుకు చెందిన నరసింహులు, వెంకటలక్ష్మిదేవి దంపతుల కుమారుడు జి.వెంకటేశులు బుద్ధిమాంద్యంతో బాధపడుతున్నాడు. మూడు నెలల క్రితం బత్తలపల్లి సెరిబ్రల్‌ పాలసీ సెంటర్‌లో చేర్పించారు.

అనంతరం ఇంటికి తీసుకువెళ్లి ఈ నెల 20న తిరిగి వెంకటేళులును తల్లి తీసుకొచ్చి సెంటర్‌లో వదిలింది. సాయంత్రం 5.30 గంటల సమయంలో గ్రౌండుకు వెళ్లిన విద్యార్థి తిరిగి రాలే దు. ఈ విషయాన్ని అదే రోజు విద్యార్థి తల్లిదండ్రులకు, పోలీసులకు ఆర్డీటీ సిబ్బంది సమాచారం అందించారు. ఐదు రోజులు అవుతున్నా జాడ కనిపించకపోవడంతో ఫిర్యాదు చేశారు. విద్యార్థి కనిపిస్తే తల్లిదండ్రులు 8897539411, ఆర్డీటీ కోచ్‌ 9493361048, ఎస్‌ఐ 9440796833 నంబర్లకు సమాచారం అందించాలని  సెంటర్‌ ఇన్‌చార్జ్‌ రాజమ్మ సిస్టర్, కోచ్‌ వెంకటేశ్వర్లు కోరారు.

Advertisement

పోల్

Advertisement