వరుడు పరార్‌ | groom jump in kalyanadurg | Sakshi
Sakshi News home page

వరుడు పరార్‌

May 31 2017 11:29 PM | Updated on Sep 5 2017 12:28 PM

మరో రెండు రోజుల్లో పెళ్లి పీటలెక్కాల్సిన వరుడు పరారయ్యాడు. ఒక రోజు ఆలస్యంగా ఈ సంఘటన వెలుగు చూసింది.

కళ్యాణదుర్గం : మరో రెండు రోజుల్లో పెళ్లి పీటలెక్కాల్సిన వరుడు పరారయ్యాడు. ఒక రోజు ఆలస్యంగా ఈ సంఘటన వెలుగు చూసింది. కళ్యాణదుర్గం ఎస్‌ఐ శంకర్‌రెడ్డి తెలిపిన మేరకు...మునిసిపాలిటీ పరిధిలోని గూబనపల్లికి చెందిన మారెప్ప కుమారుడు వెంకటేశులుకు ఉరవకొండ మండలం వై.రాంపురానికి చెందిన అక్క కూతురుతో పెళ్లి నిశ్చయించారు.

జూన్‌ ఒకటో తేదీ గూబనపల్లిలో పెళ్లికి ఏర్పాట్లు చేశారు. అయితే మే 30వ తేదీ సాయంత్రం వరుడు కనిపించకుండా వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు బంధువుల çస్వగ్రామాలలో ఆరా తీశారు. ఆచూకీ లభించలేదు. చివరికి తండ్రి మారెప్ప పట్టణ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇష్టం లేని పెళ్లి చేస్తున్నందునే వెంకటేశులు పరారైనట్లు పోలీసుల విచారణలో తేలింది. ఎస్‌ఐ కేసు నమోదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement