breaking news
venkatesulu
-
వరుడు పరార్
కళ్యాణదుర్గం : మరో రెండు రోజుల్లో పెళ్లి పీటలెక్కాల్సిన వరుడు పరారయ్యాడు. ఒక రోజు ఆలస్యంగా ఈ సంఘటన వెలుగు చూసింది. కళ్యాణదుర్గం ఎస్ఐ శంకర్రెడ్డి తెలిపిన మేరకు...మునిసిపాలిటీ పరిధిలోని గూబనపల్లికి చెందిన మారెప్ప కుమారుడు వెంకటేశులుకు ఉరవకొండ మండలం వై.రాంపురానికి చెందిన అక్క కూతురుతో పెళ్లి నిశ్చయించారు. జూన్ ఒకటో తేదీ గూబనపల్లిలో పెళ్లికి ఏర్పాట్లు చేశారు. అయితే మే 30వ తేదీ సాయంత్రం వరుడు కనిపించకుండా వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు బంధువుల çస్వగ్రామాలలో ఆరా తీశారు. ఆచూకీ లభించలేదు. చివరికి తండ్రి మారెప్ప పట్టణ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇష్టం లేని పెళ్లి చేస్తున్నందునే వెంకటేశులు పరారైనట్లు పోలీసుల విచారణలో తేలింది. ఎస్ఐ కేసు నమోదు చేశారు. -
తప్పిపోయిన బుద్ధిమాంద్య విద్యార్థి
బత్తలపల్లి : మండల కేంద్రంలోని ఆర్డీటీ బుద్ధిమాంద్య మనోవికాస కేంద్రంలో బుద్ధిమాంద్య విద్యార్థి తప్పిపోయినట్లు సిబ్బంది మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. వజ్రకరూరు మండలం కమలపాడుకు చెందిన నరసింహులు, వెంకటలక్ష్మిదేవి దంపతుల కుమారుడు జి.వెంకటేశులు బుద్ధిమాంద్యంతో బాధపడుతున్నాడు. మూడు నెలల క్రితం బత్తలపల్లి సెరిబ్రల్ పాలసీ సెంటర్లో చేర్పించారు. అనంతరం ఇంటికి తీసుకువెళ్లి ఈ నెల 20న తిరిగి వెంకటేళులును తల్లి తీసుకొచ్చి సెంటర్లో వదిలింది. సాయంత్రం 5.30 గంటల సమయంలో గ్రౌండుకు వెళ్లిన విద్యార్థి తిరిగి రాలే దు. ఈ విషయాన్ని అదే రోజు విద్యార్థి తల్లిదండ్రులకు, పోలీసులకు ఆర్డీటీ సిబ్బంది సమాచారం అందించారు. ఐదు రోజులు అవుతున్నా జాడ కనిపించకపోవడంతో ఫిర్యాదు చేశారు. విద్యార్థి కనిపిస్తే తల్లిదండ్రులు 8897539411, ఆర్డీటీ కోచ్ 9493361048, ఎస్ఐ 9440796833 నంబర్లకు సమాచారం అందించాలని సెంటర్ ఇన్చార్జ్ రాజమ్మ సిస్టర్, కోచ్ వెంకటేశ్వర్లు కోరారు.