బస్టాండ్ వద్ద బాంబు కలకలం | bomb issue in ysr kadapa bus stand | Sakshi
Sakshi News home page

బస్టాండ్ వద్ద బాంబు కలకలం

Aug 10 2015 9:06 PM | Updated on Sep 3 2017 7:10 AM

బస్టాండ్ వద్ద బాంబు కలకలం

బస్టాండ్ వద్ద బాంబు కలకలం

వైఎస్సార్ జిల్లా కేంద్రం కడప నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద సోమవారం రాత్రి బాంబు కలకలం సృష్టించింది.

వైఎస్సార్ జిల్లా కేంద్రం కడప నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద సోమవారం రాత్రి బాంబు కలకలం సృష్టించింది. ఆర్టీసీ ఆర్‌ఎం కార్యాలయం వద్ద ఓ అట్టపెట్టె చాలా సేపటి నుంచి ఉండటంతో సిబ్బంది అనుమానించారు. దీనిపై వారు వన్ టౌన్ పోలీసులకు వారు అందించారు. విషయం ఆనోటా.. ఈనోటా తెలియటంతో పెద్ద సంఖ్యలో జనం అక్కడికి చేరుకున్నారు. రాత్రి 8.30 గంటల ప్రాంతంలో బాంబు స్క్వాడ్ నిపుణులు అక్కడికి చేరుకుని పెట్టెను తెరిచి చూడగా పై భాగంలో అంతా రంపం పొట్టుతో పాటు అడుగున చిన్న రాగి చెంబు కనిపించాయి. ఎలాంటి ప్రమాదం లేదని తెలియటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement