బీచ్‌ వాలీబాల్‌ చాంపియన్‌ ‘అనంత’ | Beach Volleyball Champion anantha | Sakshi
Sakshi News home page

బీచ్‌ వాలీబాల్‌ చాంపియన్‌ ‘అనంత’

Aug 9 2016 11:39 PM | Updated on Jun 4 2019 5:58 PM

బీచ్‌ వాలీబాల్‌ చాంపియన్‌ ‘అనంత’ - Sakshi

బీచ్‌ వాలీబాల్‌ చాంపియన్‌ ‘అనంత’

బీచ్‌ వాలీబాల్‌లో రాష్ట్ర చాంపియన్‌ షిప్‌ను అనంతపురం జిల్లా జట్టు కైవసం చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలను వాలీబాల్‌ సంఘం జిల్లా అధ్యక్షుడు లక్ష్మినారాయణరెడ్డి తెలిపారు.

అనంతపురం సప్తగిరిసర్కిల్‌ : బీచ్‌ వాలీబాల్‌లో రాష్ట్ర చాంపియన్‌ షిప్‌ను అనంతపురం జిల్లా జట్టు కైవసం చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలను వాలీబాల్‌ సంఘం జిల్లా అధ్యక్షుడు లక్ష్మినారాయణరెడ్డి తెలిపారు. మొట్ట మొదటిసారిగా విశాఖపట్నంలో జరిగిన ఈ పోటీల్లో అనంతపురం జట్టు అత్యంత ప్రతిభను కనబరచి చాంపియన్‌గా నిలిచిందన్నారు. ఈ పోటీలు ఈ నెల 5 నుంచి 7 వరకూ జరిగాయని, ఇందులో 13 జిల్లాల నుంచి బాలబాలికల జట్లు పాల్గొన్నాయన్నారు. రాష్ట్ర చాంపియన్‌గా ‘అనంత’ నిలవడంపై వైస్‌ ప్రెసిడెంట్‌ సాయిప్రసాద్, విష్ణువర్ధన్, చంద్ర, శీనా, సుబ్రమణ్యం, దేవమ్మ, బలరాంలు హర్షం వ్యక్తం చేశారు.  

Advertisement
 
Advertisement
Advertisement