91 చోట్ల బతుకమ్మ సంబురాలు | bathukamma celebrations in 91 places | Sakshi
Sakshi News home page

91 చోట్ల బతుకమ్మ సంబురాలు

Sep 25 2016 8:17 PM | Updated on Sep 4 2017 2:58 PM

అందోలులో పోస్టర్‌ను విడుదల చేస్తున్న ఉదయ్‌

అందోలులో పోస్టర్‌ను విడుదల చేస్తున్న ఉదయ్‌

తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ‘బంగారు బతుకమ్మ’ పేరుతో రాష్ర్ట వ్యాప్తంగా సంబురాలు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు జి. ఉదయ్‌ భాస్కర్‌ అన్నారు.

తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు ఉదయ్‌భాస్కర్‌

జోగిపేట: తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ‘బంగారు బతుకమ్మ’ పేరుతో రాష్ర్ట వ్యాప్తంగా సంబురాలు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు జి. ఉదయ్‌ భాస్కర్‌ అన్నారు. ఆదివారం అందోలు గెస్ట్‌హౌస్‌లో బంగారు పండుగ వాల్‌పోస్టర్‌, పాటల సీడీలను ఆయన విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ  రాష్ర్ట వ్యాప్తంగా 1100 ప్రాంతాల్లో, జిల్లాలో 90 చోట్ల తెలంగాణ జాగృతి  ఆధ్వర్యంలో బంగారు బతుకమ్మ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బతుకమ్మలను అందంగా, సాంప్రదాయపద్ధతిలో పేర్చిన వారిని గుర్తించి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందజేస్తామన్నారు.  అందోలు నియోజవకర్గంలోని 7 మండలాల్లో 9 చోట్ల వేడుకలు నిర్వహిస్తామన్నారు.  తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు.

కార్యక్రమంలో బంగారు బతుకమ్మల మెదక్‌, నిజామాబాద్‌ జిల్లాల ఇన్‌చార్జ్‌లు ఉదయ్‌కిరణ్‌, భిక్షపతి, తెలంగాణ జాగృతి జిల్లా మహిళా అధ్యక్షురాలు మల్లిక, నియోజకవర్గ ఇన్‌చార్జి అనిల్‌రాజ్‌, కో ఇన్‌చార్జి అశోక్‌ ముదిరాజ్‌, కో కన్వీనర్‌ గీతారెడ్డి, నియోజకవర్గ మహిళా కన్వీనర్‌లు బాలమణి, వీరమణి, యూత్‌ విభాగం కన్వీనర్‌ శేఖర్‌, సంగారెడ్డి పట్టణ అధ్యక్షులు సురేష్‌రెడ్డి, మండల కన్వీనర్‌ బి. చంద్రశేఖర్‌, నాయకులు వినోద్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement