రేపటి నుంచి బాస్కెట్‌బాల్‌ పోటీలు | basketball games start tomorrow in lepakshi navodaya school | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి బాస్కెట్‌బాల్‌ పోటీలు

Aug 24 2017 10:03 PM | Updated on Sep 12 2017 12:56 AM

లేపాక్షి జవహర్‌ నవోదయ విద్యాలయంలో 26, 27, 28 తేదీల్లో హైదరాబాద్‌ రీజినల్‌ స్థాయిలో బాస్కెట్‌బాల్‌ పోటీలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్‌ భాస్కర్‌కుమార్‌ తెలిపారు.

లేపాక్షి: లేపాక్షి జవహర్‌ నవోదయ విద్యాలయంలో 26, 27, 28 తేదీల్లో హైదరాబాద్‌ రీజినల్‌ స్థాయిలో బాస్కెట్‌బాల్‌ పోటీలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్‌ భాస్కర్‌కుమార్‌  తెలిపారు. దక్షిణ భారతదేశంలోని కేరళ, కర్ణాటక, పుదుచ్చేరి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోని నవోదయ విద్యార్థినీ విద్యార్థులు ఇందులో పాల్గొంటారన్నారు. పోటీలకు 350 మంది విద్యార్థులు, 30 మంది పీఈటీలు హాజరవుతారనీ, 26న ఉదయం 9 గంటలకు అనంతపురం జిల్లా కలెక్టర్‌ వీరపాండియన్‌ పోటీలు ప్రారంభిస్తారని చెప్పారు. విజేతలను జాతీయస్థాయి పోటీలకు పంపనున్నట్టు ప్రిన్సిపల్‌ వివరించారు. 28న పోటీలు ముగింపు కార్యక్రమం ఉంటుందన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement