ఘాట్ల వద్ద బారికేడ్ల ఏర్పాటు | Barricades arrangement in Puskara ghat | Sakshi
Sakshi News home page

ఘాట్ల వద్ద బారికేడ్ల ఏర్పాటు

Aug 7 2016 10:07 PM | Updated on Sep 4 2017 8:17 AM

ఘాట్ల వద్ద బారికేడ్ల ఏర్పాటు

ఘాట్ల వద్ద బారికేడ్ల ఏర్పాటు

పుష్కర ఘాట్లకు వెళ్లే ప్రధాన రహదారిలో ప్రమాదకరంగా ఉన్న కృష్ణానది రిటైనింగ్‌ వాల్‌కు సమాంతరంగా ఆదివారం బారికేడ్లను ఏర్పాటు చేశారు.

సీతానగరం (తాడేపల్లి రూరల్‌) : పుష్కర ఘాట్లకు వెళ్లే ప్రధాన రహదారిలో ప్రమాదకరంగా ఉన్న కృష్ణానది రిటైనింగ్‌ వాల్‌కు సమాంతరంగా ఆదివారం బారికేడ్లను ఏర్పాటు చేశారు. సుమారు 800 మీటర్ల పొడవున్న ఈ ప్రహరీకి ఆనుకుని బారికేడ్లను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా రాత్రి సమయంలో ప్రకాశం బ్యారేజీ నుంచి కొండ వైపు, పుష్కర ఘాట్ల వరకు ఏర్పాటు చేయనున్నట్టు అధికారులు తెలిపారు. దేవాలయాల్లో కూడా లోపలకు వెళ్లేందుకు, బయటకు వచ్చేందుకు అనువుగా ఏర్పాట్లు చేయనున్నట్టు చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement