ఘాట్ల వద్ద బారికేడ్ల ఏర్పాటు
సీతానగరం (తాడేపల్లి రూరల్) : పుష్కర ఘాట్లకు వెళ్లే ప్రధాన రహదారిలో ప్రమాదకరంగా ఉన్న కృష్ణానది రిటైనింగ్ వాల్‌కు సమాంతరంగా ఆదివారం బారికేడ్లను ఏర్పాటు చేశారు. సుమారు 800 మీటర్ల పొడవున్న ఈ ప్రహరీకి ఆనుకుని బారికేడ్లను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా రాత్రి సమయంలో ప్రకాశం బ్యారేజీ నుంచి కొండ వైపు, పుష్కర ఘాట్ల వరకు ఏర్పాటు చేయనున్నట్టు అధికారులు తెలిపారు. దేవాలయాల్లో కూడా లోపలకు వెళ్లేందుకు, బయటకు వచ్చేందుకు అనువుగా ఏర్పాట్లు చేయనున్నట్టు చెప్పారు.