బాబుకు జన్మనిచ్చింది కాంగ్రెస్సే : గిడుగు | babu political life congress | Sakshi
Sakshi News home page

బాబుకు జన్మనిచ్చింది కాంగ్రెస్సే : గిడుగు

Nov 20 2016 10:30 PM | Updated on Mar 18 2019 9:02 PM

సీఎం చంద్రబాబుకు రాజకీయంగా జన్మనిచ్చి, ఓనమాలు దిద్దించింది కాంగ్రెస్‌ పార్టీయేనని, ఆ పార్టీని విమర్శించే అర్హత ఆయనకు లేదని పీసీసీ ప్రధాన కార్యదర్శి గిడుగు రుద్రరాజు విమర్శించారు. స్థానిక కాంగ్రెస్‌పార్టీ కార్యాలయంలో ఆదివారం పీసీసీ అధికార ప్రతినిధి కామన ప్రభాకరరావుతో కలిసి విలేకరుల సమావేశంలో

మండపేట : 
సీఎం చంద్రబాబుకు రాజకీయంగా జన్మనిచ్చి, ఓనమాలు దిద్దించింది కాంగ్రెస్‌ పార్టీయేనని, ఆ పార్టీని విమర్శించే అర్హత ఆయనకు లేదని పీసీసీ ప్రధాన కార్యదర్శి గిడుగు రుద్రరాజు విమర్శించారు. స్థానిక కాంగ్రెస్‌పార్టీ కార్యాలయంలో ఆదివారం పీసీసీ అధికార ప్రతినిధి కామన ప్రభాకరరావుతో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చిత్తూరు జిల్లా యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా రాజకీయ ఓనమాలు దిద్దుకున్న చంద్రబాబు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఎదిగింది కాంగ్రెస్‌పార్టీలోనేనన్నారు. రాజమహేంద్రవరంలో జరిగిన కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ కాంగ్రెస్‌పార్టీ పని అయిపోందనడాన్ని గిడుగు, కామనలు తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు పచ్చి మోసకారని, పేదల జీవితాలను కార్పొరేట్‌ శక్తులకు పణంగా పెడుతున్నారని మండిపడ్డారు. పెద్దనోట్లు రద్దు విషయం ముందుగానే తెలుసుకుని వారి ఆస్తులను కాపాడుకున్నారన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement