మావుళ్లమ్మకు 450 గ్రాములతో నల్లపూసల గొలుసు | aurnament to mavullamma with 450 grams gold | Sakshi
Sakshi News home page

మావుళ్లమ్మకు 450 గ్రాములతో నల్లపూసల గొలుసు

Aug 27 2016 12:34 AM | Updated on Sep 4 2017 11:01 AM

: పట్టణ ఇలవేల్పు మావుళ్లమ్మవారికి 450 గ్రాముల బంగారపు నల్లపూసల గొలుసును తయారు చేయించారు. స్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు చేతుల మీదుగా ఈ గొలుసును శుక్రవారం ఆలయానికి అందజే శారు. అమ్మవారికి గతంలో ఉన్న 338 గ్రాముల బంగారపు నల్లపూసల గొలుసు మరమ్మతులకు గురికాడంతో దాతల సహకారంతో కొత్త గొలుసును చేయించారు.

భీమవరం: పట్టణ ఇలవేల్పు మావుళ్లమ్మవారికి 450 గ్రాముల బంగారపు నల్లపూసల గొలుసును తయారు చేయించారు. స్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు చేతుల మీదుగా ఈ గొలుసును శుక్రవారం ఆలయానికి అందజే శారు. అమ్మవారికి గతంలో ఉన్న 338 గ్రాముల బంగారపు నల్లపూసల గొలుసు మరమ్మతులకు గురికాడంతో దాతల సహకారంతో కొత్త గొలుసును చేయించారు. పాత గొలుసులోని 237 గ్రాముల బంగారం, 112 గ్రాముల రాళ్లు నల్లపూసలకు అదనంగా దాతలు అందించిన 101 గ్రాముల బంగారాన్ని జోడించి ఈ కొత్త గొలుసు చేయించినట్టు చెప్పారు. కార్యక్రమంలో రమేష్‌కుమార్‌ అగర్వాల్, ఎంవీవీఎస్‌వీ ప్రభాకరమూర్తి, ఆలయ కార్యనిర్వహణాధికారి నల్లం సూర్య చక్రధరరావు, ధర్మకర్తల మండలి చైర్మన్‌ కార్మూరి సత్యనారాయణమూర్తి పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement