చిత్తూరు జిల్లాలో దుండగులు రెచ్చిపోయారు. పుంగనూరు బైపాస్‌లో ఒక విద్యార్థిని చెవులు కోసి రింగులు దోచుకెళ్లిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
పుంగనూరు: చిత్తూరు జిల్లాలో దుండగులు రెచ్చిపోయారు. పుంగనూరు బైపాస్‌లో ఓ విద్యార్థిని చెవులు కోసి చెవి రింగులు దోచుకెళ్లారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
స్థానిక ఓ ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఒక విద్యార్థినిపై మంగళవారం మధ్యాహ్నం కొందరు యువకులు దాడిచేశారు. బ్లేడుతో చెవులు కోసి రింగులు దోచుకెళ్లారు. సదరు విద్యార్థిని లంచ్ బ్రేక్‌లో భోజనం చేసి స్కూలు బయటకు వచ్చింది. అప్పుడే కారులో వచ్చిన నలుగురు యువకులు ఆమెపై దాడిచేసి బ్లేడుతో చెవులు కోసి రింగులు దోచుకెళ్లారు. విషయం తెలిసిన వెంటనే పుంగనూరు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. తెలుగు రాష్ట్రాల్లో వరుస చైన్ స్నాచింగ్స్తో ప్రజలకు, పోలీసులకు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నారు.