వియ్యంకుడిపై గొడ్డలితో దాడి | Attack on sibling with axe | Sakshi
Sakshi News home page

వియ్యంకుడిపై గొడ్డలితో దాడి

Dec 4 2016 10:29 PM | Updated on Sep 4 2017 9:54 PM

పట్టణంలోని కొప్పురావూరి కాలనీ ఏడోలైనులో ఆదివారం రాత్రి ఓ వ్యక్తిని హత్య చేయడం సంచలనం సృష్టించింది.

ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి
 
మంగళగిరి : పట్టణంలోని కొప్పురావూరి కాలనీ ఏడోలైనులో ఆదివారం రాత్రి ఓ వ్యక్తిని హత్య చేయడం  సంచలనం సృష్టించింది. పట్టణ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. దామర్ల ఆదినారాయణ(65)పై వియ్యంకుడు బిల్లా వేణుగోపాలకృష్ణ గొడ్డలితో తలపై దాడి చేయడంతో తీవ్ర గాయమైన బాధితుడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. ఆదినారాయణ కుమారుడు సాంబశివరావును ఏడేళ్ల కిందట వేణుగోపాలకృష్ణ కుమార్తెకు ఇచ్చి వివాహం చేశారు. ఆదినారాయణ చేనేత పని చేస్తున్నాడు. సంవత్సరం నుంచి సాంబశివరావు అతని భార్య  విభేదాలతో విడిపోయి ఉంటున్నారు. వేణుగోపాలకృష్ణ, సాంబశివరావు మధ్య ఆర్థిక వివాదం నడుస్తున్న నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం ఘర్షణ చోటుచేసుకొంది. ఒకరినొకరు చంపుకుంటామంటూ వాదులాడుకున్నారు. రాత్రి ఏడు గంటల సమయంలో మరలా వేణుగోపాలకృష్ణ, సాంబశివరావులు నగదు విషయమై బజారులో గొడవకు దిగారు.  ఈ క్రమంలో ఆదినారాయణపై గొడ్డలితో దాడి చేయడంతో తలకు బలమైన గాయంమై అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. కుమారుడు సాంబశివరావుతో పాటు స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా ఆదినారాయణ మృతి చెందాడు. సమాచారం అందుకున్న డీఎస్పీ రామాంజనేయులు, సీఐ బ్రహ్మయ్య ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నిందితుడు వేణుగోపాలకృష్ణ లక్ష్మీనృసింహస్వామి కాలనీ వద్ద ఉండగా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement