చదలవాడపై అట్రాసిటీ కేసు | atrocity case on chadalawada | Sakshi
Sakshi News home page

చదలవాడపై అట్రాసిటీ కేసు

Aug 31 2016 11:55 PM | Updated on Aug 25 2018 7:16 PM

ఫ్రుడెన్షియల్‌ షుగర్‌ ఫ్యాక్టరీలో తలెత్తిన వివాదాలకు సంబంధించి టీటీడీ చైర్మన్‌ చదలవాడ కృష్ణమూర్తిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు బుధవారం నమోదైంది.

నిండ్ర: ఫ్రుడెన్షియల్‌ షుగర్‌ ఫ్యాక్టరీలో తలెత్తిన వివాదాలకు సంబంధించి టీటీడీ చైర్మన్‌ చదలవాడ కృష్ణమూర్తిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు బుధవారం నమోదైంది. ఫ్యాక్టరీలో పని చేస్తున్న కొప్పేడు దళితవాడకు చెందిన షణ్ముగం ఫిర్యాదు మేరకు... చదలవాడ కృష్ణమూర్తి తన అనుచరులతో ఈ నెల 25న కర్మాగారంలో గొడవ సృష్టిస్తుంటే తాము అడ్డుకున్నామని, ఆ సమయంలో తనను చదలవాడ అనుచరులు కులం పేరుతో దూషించారంటూ అదే రోజున షణ్ముగం నిండ్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారించిన అనంతరం బుధవారం చదలవాడ కృష్ణమూర్తిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్టు నిండ్ర ఏఎస్‌ఐ దేవదాసు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement