హక్కుల కోసం ప్రభుత్వాలను నిలదీయాలి | ask for rights | Sakshi
Sakshi News home page

హక్కుల కోసం ప్రభుత్వాలను నిలదీయాలి

Jan 18 2017 11:49 PM | Updated on Sep 5 2017 1:32 AM

హక్కుల కోసం ప్రభుత్వాలను నిలదీయాలని నాయీ బ్రాహ్మణ ఫెడరేషన్‌ రాష్ట్ర చైర్మన్‌ గుంటుపల్లి నాగేశ్వరరావు అన్నారు.

 – నాయీ బ్రాహ్మణ ఫెడరేషన్‌ చైర్మన్‌ గుంటుపల్లి నాగేశ్వరరావు
 
పత్తికొండ టౌన్‌ : హక్కుల కోసం ప్రభుత్వాలను నిలదీయాలని నాయీ బ్రాహ్మణ ఫెడరేషన్‌ రాష్ట్ర చైర్మన్‌ గుంటుపల్లి నాగేశ్వరరావు అన్నారు. బుధవారం పత్తికొండకు వచ్చిన ఆయనను నాయీ బ్రాహ్మణ సంఘం నాయకులు సన్మానించారు. జీఓల  అమలులో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆయన ఆరోపించారు. నాయీ బ్రాహ్మణులపై ఎండోమెంట్‌ అధికారులు వివక్ష చూపిస్తున్నారని విమర్శించారు. దేవాదాయశాఖలో ఖాళీగా ఉన్న 3 వేల ఉద్యోగాలను నాయీ బ్రాహ్మణులతో భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. ఆలయాల్లో ఎలక్ట్రానిక్‌ తబలా, వాయిద్యాలను వాడటం నిలిపివేసి నాయీ హ్మణులను తీసుకోవాలన్నారు.
        నాయిబ్రాహ్మణ ఫెడరేషన్‌కు ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.56కోట్లు నిధులు కేటాయించినా 101 జీఓతో లబ్ధిదారులకు న్యాయం జరగడం లేదన్నారు. బ్యాంకు లింకేజీతో సంబంధం లేకుండా లబ్ధిదారులకు ప్రభుత్వం నేరుగా సబ్సిడీ రుణాలు మంజూరుచేయాలని కోరారు. నాయీ బ్రాహ్మణ సేవాసంఘం గౌరవాధ్యక్షుడు కారన్న అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఏపీ రైతుసంఘం(సీపీఐ) రాష్ట్ర అధ్యక్షుడు పి.రామచంద్రయ్య, నాయీబ్రాహ్మణ సేవాసంఘం జిల్లా అధ్యక్షుడు సివి.నర్సయ్య, తాలుకా అధ్యక్షుడు గోవిందరాజులు, కార్యదర్శి లింగన్న, నాయకులు జయరాముడు, రమేష్, డోలు అంజినయ్య, చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.
 
చైర్మన్లకు ఘనసన్మానం :  స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో విశ్వబ్రాహ్మణ సంఘం ఫెడరేషన్‌  చైర్మన్‌ కనకాచారికి తాలుకా అధ్యక్షుడు దామోదరాచారి, మండలాధ్యక్షుడు బ్రహ్మయ్య ఆచారి ఆధ్వర్యంలో విశ్వబ్రాహ్మణులు ఘనంగా సన్మానం చేశారు. సగర(ఉప్పర)సంఘం ఫెడరేషన్‌ చైర్మన్‌ ఏడుకొండలు, శాలివాహన సంఘం ఫెడరేషన్‌ చైర్మన్‌ తుగ్గలినాగేంద్రలను స్థానిక ఉప్పరసంఘం నాయకులు యుసీ ఆంజనేయులు, శ్రీనివాసులు, నరసింహమూర్తి, రవి ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు.రజకసంఘం ఫెడరేషన్‌ చైర్మన్‌ రాజమండ్రి నారాయణను ఆ సంఘం పట్టణాధ్యక్షుడు నారి ఆధ్వర్యంలో రజకులు ఘనంగా సన్మానించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement