భక్తులతో అరుణాచలేశ్వరాలయం కిటకిట | arunachaleswaramlp bhakthularaddi | Sakshi
Sakshi News home page

భక్తులతో అరుణాచలేశ్వరాలయం కిటకిట

Jul 19 2016 8:56 PM | Updated on Sep 4 2017 5:19 AM

భక్తులతో అరుణాచలేశ్వరాలయం కిటకిట

భక్తులతో అరుణాచలేశ్వరాలయం కిటకిట

తమిళ ఆడి మాస పౌర్ణమిని పురస్కరించుకొని తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయం గిరివలయం రోడ్డులో భక్తులతో కిటకిటలాడింది. అరుణాచలేశ్వరాలయంలో ప్రతి నెలా పౌర్ణమి రోజున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గిరివలయం రోడ్డులో 14 కి.మీ దూరం కాలినడకన వెళ్లి స్వామి వారిని దర్శించుకోవడం ఆనవాయితి.

భక్తులతో అరుణాచలేశ్వరాలయం కిటకిట
వేలూరు: తమిళ ఆడి మాస పౌర్ణమిని పురస్కరించుకొని తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయం గిరివలయం రోడ్డులో భక్తులతో కిటకిటలాడింది. అరుణాచలేశ్వరాలయంలో ప్రతి నెలా పౌర్ణమి రోజున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గిరివలయం రోడ్డులో 14 కి.మీ దూరం కాలినడకన వెళ్లి స్వామి వారిని దర్శించుకోవడం ఆనవాయితి. అందుకు తగ్గట్టుగానే ఆలయ జాయింట్‌ కమిషనర్‌ వాసుదేవన్‌ అధ్యక్షతన ఆలయంలో భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లును సిద్ధం చేశారు. అదే విధంగా ఆలయంలోని అన్నామలైయార్‌ సమేత ఉన్నామలై అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేసి పుష్పాలంకరణ చేశారు. ఆడి మాస పౌర్ణమి సమయంలో గిరివలయం రోడ్డులో కాలినడకన వెళ్లి స్వామి వారిని దర్శించుకుంటే చేసిన పాపాలు తొలగిపోయి పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం అందులో భాగంగా  వివిధ ప్రాంతాల నుంచి  భక్తులు అధిక సంఖ్యలో తిరువణ్ణామలై చేరుకొని స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామి వారిని మాడ వీధుల్లో ఊరేగించడంతో భక్తులు కర్పూర హారతులు పట్టి మొక్కులు తీర్చుకున్నారు.


 

Advertisement

పోల్

Advertisement