పోలీసులకు ప్రశంసా పత్రాలు | appreciation for police | Sakshi
Sakshi News home page

పోలీసులకు ప్రశంసా పత్రాలు

Sep 8 2016 11:28 PM | Updated on Aug 21 2018 5:54 PM

పోలీసులకు ప్రశంసా పత్రాలు - Sakshi

పోలీసులకు ప్రశంసా పత్రాలు

నేత్రదానం చేయడానికి కృషి చేసిన పోలీసు అధికారులకు ఎల్‌.వి.ప్రసాద్‌ ఐ–ఇన్‌స్టిట్యూట్‌ పంపిన ప్రశంసా పత్రాలను ఎస్పీ ఆకే రవికృష్ణ సిబ్బందికి అందజేశారు.

కర్నూలు:  నేత్రదానం చేయడానికి కృషి చేసిన పోలీసు అధికారులకు ఎల్‌.వి.ప్రసాద్‌ ఐ–ఇన్‌స్టిట్యూట్‌ పంపిన ప్రశంసా పత్రాలను ఎస్పీ ఆకే రవికృష్ణ సిబ్బందికి అందజేశారు. నేత్రదాన పక్షోత్సవాలు చివరిరోజు సందర్భంగా గురువారం సీఐలు మధుసూదన్‌రావు, నాగరాజారావు, ఎస్‌ఐలు మల్లికార్జున, చంద్రబాబు నాయుడు, మహేష్‌కుమార్, ఏఎస్‌ఐ రవికుమార్, హెడ్‌ కానిస్టేబుళ్లు నాగరాజు, ఎస్‌.ఎం.బాషా, శ్రీనివాసులు, మాస్టర్‌ సుకుమార్‌ తదితరులు ఎస్పీ చేతుల మీదుగా ప్రశంసాపత్రాలను అందుకున్నారు. రామయమ్మ అంతర్జాతీయ నేత్ర నిధి డిపార్ట్‌మెంట్‌ వారికి నేత్రదానం కోసం పోలీసు అధికారులు సహకరించినందుకు ఎల్‌.వి.ప్రసాద్‌ ఐ–ఇన్‌స్టిట్యూట్‌ హైదరాబాద్‌ ద్వారా గుర్తించిన సిబ్బందికి కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లో ప్రశంసాపత్రాలను అందజేశారు. నేత్రదానంపై త్వరలో హిందీ పాట రాసి స్వయంగా విడుదల చేసి ఇతర రాష్ట్రాలకు తెలిసేలా యువతను చైతన్యపరచనున్నట్లు ఎస్పీ ఆకే రవికృష్ణ పేర్కొన్నారు. నేత్రదానం పాటకు కృషి చేసిన డైరెక్టర్‌ శశిధర్‌రెడ్డి, మ్యూజిక్‌ ఫయూం, జుబేర్‌ అహ్మద్‌లను ఎస్పీ అభినందించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement