తాత్కాలిక సచివాలయంలో చంద్రబాబు | ap cm chandrababu naidu visits temporary secretariat in velagapudi | Sakshi
Sakshi News home page

తాత్కాలిక సచివాలయంలో చంద్రబాబు

Jul 4 2016 11:37 AM | Updated on Aug 18 2018 8:39 PM

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయాన్ని సందర్శించారు.

అమరావతి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయాన్ని సందర్శించారు. సచివాలయ నిర్మాణపు పనులు జరుగుతున్న తీరును ఆయన పరిశీలించారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా వెలగపూడిలో ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయం జూన్ 29న లాంఛనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే.

అయితే ఆ సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చైనా పర్యటనలో ఉన్నారు. దాంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఠక్కర్తో పాటు మంత్రి అయ్యన్నపాత్రుడు తాత్కాలిక సచివాలయాన్ని ఆరంభించారు. కాగా మరో రెండు నెలల్లో సెక్రటేరియేట్‌ పనులు పూర్తి కానున్నాయి. ఆ సమయానికి ఉద్యోగులందరినీ అమరావతికి తరలించనున్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement