'ఆమెకే అలా అయితే.. ఇక సాధారణ మహిళలు' | ap cabinet trying to save chinthamaneni | Sakshi
Sakshi News home page

'ఆమెకే అలా అయితే.. ఇక సాధారణ మహిళలు'

Jul 23 2015 12:44 PM | Updated on Apr 4 2019 12:50 PM

'ఆమెకే అలా అయితే.. ఇక సాధారణ మహిళలు' - Sakshi

'ఆమెకే అలా అయితే.. ఇక సాధారణ మహిళలు'

ఏపీ కేబినెట్ సమావేశంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కు క్లీన్ చిట్ ఇవ్వడం దుర్మార్గం అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు.

తిరుపతి:ఏపీ కేబినెట్ సమావేశంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కు క్లీన్ చిట్ ఇవ్వడం దుర్మార్గం అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. చింతమనేనిని వెనకేసుకు రావడానికి తహశీల్దార్ వనజాక్షిని బలిపుశువును చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా ఎమ్మార్వోకే రక్షణ లేదంటే ఇక రాష్ట్రంలో సాధారణ మహిళల పరిస్థితి ఏమిటో అర్ధం చేసుకోవచ్చని అన్నారు.

వనజాక్షి తరుఫున రెవెన్యూ ఉద్యోగ సంఘాలు పోరాడాలని ఆమె పిలుపునిచ్చారు.ఆ పోరాటానికి వైఎస్సార్సీపీ పూర్తి మద్దతు ఇస్తుందని చెప్పారు. బుధవారం అయిన కేబినెట్ సమావేశం ఎమ్మార్వో వనజాక్షిదే తప్పని తీర్మానం చేసిన విషయం తెలిసిందే. ఆమె తన అధికార పరిధిని దాటి జోక్యం చేసుకున్నారని చింతమనేని ప్రభాకర్ను వెనకేసుకొని వచ్చిన నేపథ్యంలో ఏపీ సర్కార్పై విమర్శలు పెల్లుభుకుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement