ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలి | Anounce Special Package | Sakshi
Sakshi News home page

ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలి

Aug 21 2016 6:15 PM | Updated on Mar 23 2019 9:10 PM

మాట్లాడుతున్న నాయిబ్రాహ్మణ రాష్ట్ర కన్వీనర్‌ చంద్రశేఖర్‌ - Sakshi

మాట్లాడుతున్న నాయిబ్రాహ్మణ రాష్ట్ర కన్వీనర్‌ చంద్రశేఖర్‌

మరికల్‌ (ధన్వాడ) : నాయి బ్రాహ్మణుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలని నాయి మిత్ర మండలి రాష్ట్ర కన్వీనర్‌ అశ్వినిచంద్రశేఖర్‌ అన్నారు.

మరికల్‌ (ధన్వాడ) : నాయి బ్రాహ్మణుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలని నాయి మిత్ర మండలి రాష్ట్ర కన్వీనర్‌ అశ్వినిచంద్రశేఖర్‌ అన్నారు. ఆదివారం మరికల్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో వెనుకబడిన తమకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి నిధులు కేటాయించాలని కోరారు. క్షీరవృత్తి, వాయిద్య కళాకారులకు చేయూత నిచ్చేందుకు నాయిబ్రాహ్మణ ఫెడరేషన్‌ పాలక కమిటీని ఏర్పాటు చేసి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. నాయిబ్రాహ్మణ విద్యార్థులను ప్రోత్సహించేందుకు జిల్లాకు ఒక గురుకుల పాఠశాల ఏర్పాటు చేసి ఆదుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి అశోక్‌కుమార్, నాయకులు గోపాల్, దేవరాజ్, వేణు, శేఖర్‌ పాల్గొన్నారు. 
 
 

Advertisement
 
Advertisement
Advertisement