బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీన పడిందని విశాఖ పట్టణం తుఫాను హెచ్చరికల కేంద్రం ప్రకటించింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీన పడిందని విశాఖ పట్టణం తుఫాను హెచ్చరికల కేంద్రం ప్రకటించింది. అయినా.. రెండు కిలోమీటర్ల వరకూ ఉపరితల ఆవర్తనం కొనసాగుతూ ఉందని తెలిపింది. దీనివల్ల మరో 24 గంటల పాటు కోస్తాంధ్రలో వర్షాలు కురుస్తాయని, ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉదని పేర్కొంది. కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని.. మత్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.