అంగన్‌వాడీల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తా | anganwadi problems discussion in assembly | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తా

Sep 25 2016 12:10 AM | Updated on Sep 4 2017 2:48 PM

అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు ,ఆశావర్కర్లు, ఏఎన్‌ఎంల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తానని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. మాతాశిశు ఆరోగ్యం ,మిషన్‌ ఇంద్రధనుష్‌పై స్థానిక బాలికోన్నత పాఠశాల ఆవరణలో శనివారం జరిగిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

రాయచోటి: అంగన్‌వాడీ  కార్యకర్తలు, ఆయాలు ,ఆశావర్కర్లు, ఏఎన్‌ఎంల  సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తానని  ఎమ్మెల్యే  గడికోట శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు.  మాతాశిశు ఆరోగ్యం ,మిషన్‌ ఇంద్రధనుష్‌పై   స్థానిక బాలికోన్నత పాఠశాల ఆవరణలో శనివారం జరిగిన   అవగాహన సదస్సుకు   ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ ,ఆశావర్కర్లు , ఏఎన్‌ఎంలు  తమ సమస్యలను ఆయన  దష్టికి తీసుకొచ్చారు. స్పందించిన ఎమ్మెల్యే పరిష్కరించేలా  ప్రభుత్వంపై  ఒత్తిడి తీసుకొస్తానన్నారు.   
–   రాయచోటి నుంచి కాకుళారం ఆర్‌టీసీ  బస్సు సర్వీసు వేళలను  మార్పించాలని ఎమ్మెల్యే   శ్రీకాంత్‌రెడ్డిని  బాలికోన్నత పాఠశాల  విద్యార్థినిలు కోరారు  స్పందించిన ఎమ్మెల్యే వెంటనే ఆర్‌టీసీ డీఎం  ముత్యాల నాయక్‌ కు ఫోన్‌చేసి  విద్యార్థులకు అవసరమైన సమయంలో  బస్సు నడిపితే  ప్రయోజనకరంగా ఉంటుందన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement