అంగన్వాడీల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తా
రాయచోటి: అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు ,ఆశావర్కర్లు, ఏఎన్ఎంల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తానని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. మాతాశిశు ఆరోగ్యం ,మిషన్ ఇంద్రధనుష్‌పై స్థానిక బాలికోన్నత పాఠశాల ఆవరణలో శనివారం జరిగిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అంగన్వాడీ ,ఆశావర్కర్లు , ఏఎన్ఎంలు తమ సమస్యలను ఆయన దష్టికి తీసుకొచ్చారు. స్పందించిన ఎమ్మెల్యే పరిష్కరించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తానన్నారు.
– రాయచోటి నుంచి కాకుళారం ఆర్టీసీ బస్సు సర్వీసు వేళలను మార్పించాలని ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డిని బాలికోన్నత పాఠశాల విద్యార్థినిలు కోరారు స్పందించిన ఎమ్మెల్యే వెంటనే ఆర్టీసీ డీఎం ముత్యాల నాయక్ కు ఫోన్‌చేసి విద్యార్థులకు అవసరమైన సమయంలో బస్సు నడిపితే ప్రయోజనకరంగా ఉంటుందన్నారు.