ప్రపంచ మేధావి అంబేడ్కర్‌ | ambedkar is geniuos in th world | Sakshi
Sakshi News home page

ప్రపంచ మేధావి అంబేడ్కర్‌

Jan 20 2017 9:39 PM | Updated on Sep 5 2017 1:42 AM

ప్రపంచ మేధావి అంబేడ్కర్‌

ప్రపంచ మేధావి అంబేడ్కర్‌

బిడారుదిబ్బ(కర్లపాలెం): ప్రపంచ మేధావి డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ రచించిన రాజ్యాంగంతో బడుగు, బలహీన వర్గాలు అభివృద్ధి సాధిస్తున్నాయని , ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ఓఎస్‌డీ రావల సుబ్బారావు అన్నారు.

 
 
ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ఓఎస్‌డీ రావల సుబ్బారావు
 
 
 బిడారుదిబ్బ(కర్లపాలెం): ప్రపంచ మేధావి డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ రచించిన రాజ్యాంగంతో బడుగు, బలహీన వర్గాలు అభివృద్ధి సాధిస్తున్నాయని , ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ఓఎస్‌డీ రావల సుబ్బారావు అన్నారు. మండలంలోని బిడారుదిబ్బ గ్రామంలోని లూథరన్‌ క్రైస్తవ దేవాలయం ప్రాంగణంలో  తుర్లపాటి రమేష్‌బాబు, లత దంపతులచే గ్రామ అంబేడ్కర్‌ యూత్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాన్ని శుక్రవారం రావల సుబ్బారావు, అన్నవరపు కిషోర్‌బాబు  ఆవిష్కరించారు. అనంతరం దళితనేత సలగల రాజశేఖర్‌బాబు అధ్యక్షతన జరిగిన సభలో రావల సుబ్బారావు మాట్లాడుతూ పేదరికంలో పుట్టినప్పటికీ ఎన్నో కష్టాలకు ఓర్చి అంబేడ్కర్‌ అత్యున్నతస్థాయికి ఎదిగారని అన్నారు.  రాష్ట్ర మాల మహానాడు జేఏసీ కన్వీనర్‌ అన్నవరపు కిషోర్‌బాబు, విగ్రహ దాత తుర్లపాటి రమేష్‌బాబు తదితరులు ప్రసంగించారు. కార్యక్రమంలో    గ్రామ సర్పంచ్‌ మందపాటి ఎస్తేరమ్మ, బహుజన కెరటాల వ్యవస్థాపకుడు పి.శ్రీరాములు, అంబేడ్కర్‌ యువజన సేవా సమాఖ్య గౌరవ అధ్యక్షుడు పరమానందకుమార్, బాపట్ల, కర్లపాలెం, అంబ్కేడర్‌ యువజన సేవా సమాఖ్య అధ్యక్షులు సుభాషణరావు, ధనుంజయ్‌రావు, ఎన్‌ఆర్‌ఐ పి.నాగరాజు, గ్రామ అంబేడ్కర్‌ యువజన సమాజం సభ్యులు, గ్రామపెద్దలు, దళిత నాయకులు పాల్గొన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement