breaking news
genious
-
సరైన ప్రశంసలతోనే... జీనియస్ మైండ్ సెట్!
‘‘అమ్మా.. నేను క్లాస్ ఫస్ట్ వచ్చా!’’ ‘‘వావ్... కంగ్రాచ్యులేషన్స్ నాన్నా. నువ్వు తెలివైనవాడివి! ’’ అని మెచ్చుకుంది తల్లి. తల్లి ప్రశంసలతో ఆ బిడ్డ కాసేపు సంతోషపడుతుంది. గర్వపడుతుంది. కానీ వారం తర్వాత కాస్త కష్టమైన టాపిక్ రాగానే, ‘‘నేను తెలివైనవాడినైతే ఇది ఎందుకు రాలేదు?’’ అని ఆలోచనలో పడిపోతుంది. అక్కడినుంచి మెల్లగా మోటివేషన్ పోతుంది. ప్రశంస అంటే కేవలం మాటలు కాదు. అది మెదడులోని న్యూరాన్లకు ఇచ్చే సూచన. ప్రతి మాట మీ బిడ్డ మెదడులో కొత్త కనెక్షన్లు నెలకొల్పుతుంది. అందుకే మెచ్చుకోవడంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. మెచ్చుకున్నా తప్పేనా? పిల్లలు ఏదైనా సాధించగానే ‘‘శభాష్, నువ్వు బెస్ట్, నువ్వు ఇంటెలిజెంట్’’ అని టీచర్లు, పేరెంట్స్ మెచ్చుకుంటారు. ఇలాంటి తప్పు రకమైన ప్రశంసలు పిల్లలను ట్రాప్‌లో పడేస్తాయి. ఇతరులతో పోల్చే ప్రశంస తాత్కాలికంగా ఉత్సాహాన్నిస్తుంది. కాని, ‘ఇతరులకంటే ముందుండడమే నాకు విలువ’ అనే తప్పు నమ్మకాన్ని ఏర్పరుస్తాయి.చిన్న విషయాలకే పెద్ద ప్రశంసలు ఇస్తే వాటి విలువ తగ్గిపోతుంది.నువ్వు సక్సెస్ అయితేనే ప్రశంసిస్తామనే తీరు చాలా ప్రమాదకరం. దీంతో ఆప్యాయతను పర్ఫార్మెన్స్తో లింక్ చేసుకుంటారు. తరచుగా ప్రశంసలపై ఆధారపడితే పిల్లలు అంతర్గత కుతూహలం కోల్పోతారు. స్వతంత్రంగా ప్రయత్నించడం తగ్గిపోతుంది. ప్రశంసలో నిజాయితీ లేకపోతే పిల్లల నమ్మకం దెబ్బతింటుంది. సైన్స్ ఏమంటుంది?పిల్లలకు ప్రోత్సాహం ఇవ్వడంపై మానసిక శాస్త్రవేత్తలు, న్యూరో సైంటిస్టులు దశాబ్దాలుగా పరిశోధనలు చేస్తున్నారు. మీరిచ్చే ప్రశంసలు వారి మెదడును, మైండ్ సెట్‌ను షేప్ చేస్తాయని వాటిలో వెల్లడైంది. న్యూరోప్లాస్టిసిటీ: మన మెదడు అనుభవాల ఆధారంగా రీవైర్ చేసుకుంటుంది. ప్రయత్నం, పద్ధతి, పట్టుదలపై ఇచ్చే ప్రశంస డోపమైన్ అనే ‘మోటివేషన్ కెమికల్’ను విడుదల చేస్తుంది.ఎపిజెనెటిక్స్: జీన్స్ మన జీవితాన్ని నిర్ణయించవు. ఏ జీన్స్ ‘ఆన్’ అవ్వాలి, ఏవి ‘ఆఫ్’ అవ్వాలనేది వాతావరణం నిర్ణయిస్తుందని ఎపిజెనెటిక్స్ పరిశోధనలు చెప్తున్నాయి. సెల్ఫ్–డిటర్మినేషన్ థియరీ: పిల్లలు సక్సెస్ అవ్వాలంటే అటానమీ, కాంపిటెన్స్, రిలేటెడ్నెస్ అనే మూడు అవసరాలు తీరాలి. సరైన ప్రశంస ఈ మూడింటినీ అందిస్తుంది. ఫ్లో సైకాలజీ: ఫ్లో స్టేట్ అంటే నైపుణ్యాలు, సవాళ్లు సమపాళ్లలో ఉండే స్థితి. సరైన ప్రశంస పిల్లలను ఫ్లో స్టేట్ వైపు నెడుతుంది. అప్పుడే పిల్లల అసలు జీనియస్ వెలుగులోకి వస్తుంది.సరైన ప్రశంసలకు 10 టిప్స్...‘‘నువ్వు స్టెప్ బై స్టెప్‌గా చేసిన తీరు చాలా నచ్చింది’’ అని ప్రాసెస్‌ని గుర్తించండి.‘‘నీ ప్రశ్నలు ఆసక్తికరంగా ఉన్నాయి. సైంటిస్ట్‌లా ఆలోచిస్తున్నావు’’ అని క్యూరియాసిటీకి విలువనివ్వండి. ‘‘ఎన్నిసార్లు ఫెయిల్ అయినా వదల్లేదు, అదే నిజమైన శక్తి’’ అని ప్రయత్నాన్ని హైలైట్ చేయండి.‘‘నీ ఆలోచన ప్రత్యేకంగా ఉంది’’ అని ఒరిజినాలిటీని సెలబ్రేట్ చేయండి. ‘‘గతంలో కష్టమనిపించింది ఇప్పుడు బాగా చేశావు. ఇదే నిజమైన అభివృద్ధి’’ అని ఇంప్రూవ్‌మెంట్‌పై ఫోకస్ చేయండి.‘‘నీ వ్యాస పరిచయం చాలా స్పష్టంగా ఉంది’’ అని స్పెసిఫిక్‌గా చెప్పండి.‘‘ఒకే సమస్యకు పలు మార్గాల్లో ప్రయత్నించడం చాలా స్మార్ట్ స్ట్రాటజీ’’ అని ప్రాబ్లమ్ సాల్వింగ్ని ప్రోత్సహించండి.‘‘ఈ ప్రాజెక్ట్‌లో ఏ భాగం నీకు ఎక్కువ సంతోషాన్నిచ్చింది?’’ అని రిఫ్లెక్షన్కి దారి చూపండి.‘‘ఈ పనిని ప్రేమగా చేసినప్పుడు ఎంత అందంగా వచ్చిందో గమనించావా?’’ అని ఎఫర్ట్‌తో పాటు ఎమోషన్ని గుర్తించండి.‘‘ఇది బాగా చేశావు, ఇప్పుడు నెక్ట్స్ లెవెల్ ప్రయత్నిస్తావా?’’ అని ప్రశంసని చాలెంజ్‌తో కలిపి ఇవ్వండి. సైకాలజిస్ట్ విశేష్ ఫౌండర్, జీనియస్ మేట్రిక్స్ హబ్ (చదవండి: వయసు 84 ఏళ్లు..కానీ ఇతడి టాలెంట్ మాములుగా లేదుగా..!) -
లెక్కలతో జీవితాన్నే తిరగరాసుకున్న ఖైదీ..!
జైలు గోడల మధ్య మగ్గిపోతున్న కాలంలోనే ఎందరో స్వాతంత్య్ర సమరయోధులు, పోరాట నాయకులు అద్భుతమైన రచనలు చేసిన సంగతి చాలామందికి తెలుసు. అయితే, అమెరికాలో జైలు గోడల మధ్య శిక్ష అనుభవిస్తున్న ఒక ఖైదీ స్వయంకృషితో గణిత సాధన చేస్తూ, ప్రపంచ గణిత మేధావుల దృష్టిని ఆకట్టుకుంటున్నాడు. దృఢసంకల్పం ఉండాలే గాని, అనుకున్నది సాధించడానికి జైలుగోడలు ఆటంకం కాదని నిరూపిస్తున్నాడు.ఆ ఖైదీ పేరు క్రిస్టఫర్ హేవెన్స్. హత్య కేసులో అతడికి 2010లో పాతికేళ్ల జైలు శిక్ష పడింది. అప్పటి నుంచి జైలులో ఒంటరి గదిలో ఉంటూ లెక్కల లోకంలో లోతుగా మునిగిపోయాడు. జైలు గదిలో చిన్న పజిల్స్‌తో మొదలైన ప్రయాణం, పెద్ద గణిత సూత్రాల వరకు వెళ్లింది. అతడు ఉండే జైలు గదిలో కంప్యూటర్ లేదు, ఇంటర్నెట్ లేదు, చేతిలో పుస్తకం, మదిలో లక్ష్యాలు తప్ప. అలా లెక్కలు వేసి వేసి నోటుబుక్కులు, జైలు గోడలు నింపేశాడు. ఏకంగా ప్రపంచానికి కొత్త గణిత రహస్యాన్ని చూపించి, గణిత పండితులను ఆశ్చర్యంలో ముంచెత్తాడు. క్రిస్టఫర్ ప్రయాణం అంతటితోనే ఆగలేదు. ‘నేను మాత్రమే కాదు, అందరూ గణితం నేర్చుకోవాల్సిందే!’అనే తపనతో, జైల్లో నుంచే ఖైదీల కోసం ‘ప్రిజన్ మ్యాథ్స్ ప్రాజెక్టు’ ప్రారంభించాడు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కింద అమెరికాలోని దాదాపు ముప్పై రాష్ట్రాల్లో వందలాది ఖైదీలు గణితంలో మునిగి తేలుతున్నారు. వారిని చూస్తే, నిజంగా జైలులో ఉన్నారా, లేక ఏదైనా విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఉన్నారా అనే అనుమానం కలుగుతుంది. మరో కొత్త ప్రయత్నంఇంతలోనే ఇంకో కొత్త ప్రయత్నం. ‘కంప్యూటర్ లేని ఖైదీలు గణితంలో సంక్లిష్టమైన లెక్కలు ఎలా చేయాలి?’ అనే ప్రశ్న తలెత్తింది. అప్పుడే హేవెన్స్కి తట్టిన ఆలోచన. ‘ఈమెయిలు ద్వారా కోడింగ్’ ఈ పద్ధతిలో కోడ్ లేఖలా పంపిస్తారు, ఫలితాలు తిరిగి వస్తాయి. ఈ విధానంతో జైలులో ఉండే ఖైదీ ఇప్పుడు మేఘగణన చేస్తున్నాడు. ప్రస్తుతం క్రిస్టఫర్, జర్మనీకి చెందిన గణిత నిపుణుడితో కలిసి ‘జోప్’ అనే గణిత శ్రేణిపై పరిశోధన చేస్తున్నాడు. ఈ విషయమై హేవెన్స్ మాట్లాడుతూ, ‘న్యాయం అంటే శిక్ష కాదు, మార్పు. లెక్కలతో నా జీవితాన్ని తిరిగి రాసుకున్నా’ అని చెప్పాడు. (చదవండి: పెయిన్ కిల్లర్స్ వాడితే..ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేయకూడదా..?) -
ప్రపంచ మేధావి అంబేడ్కర్
ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఓఎస్డీ రావల సుబ్బారావు బిడారుదిబ్బ(కర్లపాలెం): ప్రపంచ మేధావి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగంతో బడుగు, బలహీన వర్గాలు అభివృద్ధి సాధిస్తున్నాయని , ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఓఎస్డీ రావల సుబ్బారావు అన్నారు. మండలంలోని బిడారుదిబ్బ గ్రామంలోని లూథరన్ క్రైస్తవ దేవాలయం ప్రాంగణంలో తుర్లపాటి రమేష్‌బాబు, లత దంపతులచే గ్రామ అంబేడ్కర్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని శుక్రవారం రావల సుబ్బారావు, అన్నవరపు కిషోర్‌బాబు ఆవిష్కరించారు. అనంతరం దళితనేత సలగల రాజశేఖర్‌బాబు అధ్యక్షతన జరిగిన సభలో రావల సుబ్బారావు మాట్లాడుతూ పేదరికంలో పుట్టినప్పటికీ ఎన్నో కష్టాలకు ఓర్చి అంబేడ్కర్ అత్యున్నతస్థాయికి ఎదిగారని అన్నారు. రాష్ట్ర మాల మహానాడు జేఏసీ కన్వీనర్ అన్నవరపు కిషోర్‌బాబు, విగ్రహ దాత తుర్లపాటి రమేష్‌బాబు తదితరులు ప్రసంగించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మందపాటి ఎస్తేరమ్మ, బహుజన కెరటాల వ్యవస్థాపకుడు పి.శ్రీరాములు, అంబేడ్కర్ యువజన సేవా సమాఖ్య గౌరవ అధ్యక్షుడు పరమానందకుమార్, బాపట్ల, కర్లపాలెం, అంబ్కేడర్ యువజన సేవా సమాఖ్య అధ్యక్షులు సుభాషణరావు, ధనుంజయ్‌రావు, ఎన్ఆర్ఐ పి.నాగరాజు, గ్రామ అంబేడ్కర్ యువజన సమాజం సభ్యులు, గ్రామపెద్దలు, దళిత నాయకులు పాల్గొన్నారు.