ఆర్టీపీపీలో అన్ని యూనిట్లు ట్రీప్‌ | All units artipipilo trip | Sakshi
Sakshi News home page

ఆర్టీపీపీలో అన్ని యూనిట్లు ట్రీప్‌

Oct 21 2016 11:56 PM | Updated on Sep 4 2017 5:54 PM

ఎర్రగుంట్ల మండలంలో ఉన్న రాయలసీమ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు(ఆర్టీపీపీ)లోని యూనిట్లు అన్ని శుక్రవారం ఒక్కసారిగా ట్రిప్‌ అయ్యాయి.

ఎర్రగుంట్ల: ఎర్రగుంట్ల మండలంలో ఉన్న రాయలసీమ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు(ఆర్టీపీపీ)లోని యూనిట్లు అన్ని శుక్రవారం  ఒక్కసారిగా ట్రిప్‌ అయ్యాయి. దీంతో 1,050 మెగావాట్లు విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. అయితే మధ్యాహ్న సమయానికి 2వ యూనిట్‌ సర్వీసులోకి రాగా, మిగిలిన యూనిట్లు రాత్రికి సర్వీసులోకి రావచ్చని అధికారులు తెలియజేస్తున్నారు. ఆర్టీపీపీలోని స్విచ్‌యార్డులో సాంకేతికలోపం కారణంగా గ్రిడ్‌ ఫైయిలైంది. దీంతో ఒక్కసారిగా ఆర్టీపీపీలో ఉన్న 1,2,3,4,5 యూనిట్లు ట్రిప్‌ అయి ఉత్పత్తి ఆగిపోయింది. ఈ విషయంపై ఆర్టీపీపీ సీఈ సుబ్రమణ్యంరాజును వివరణ కోరగా స్విచ్‌యార్డులో గ్రిడ్‌లో ఏర్పడిన సాంకేతికలోపంతో యూనిట్లు ట్రిప్‌ అయినట్లు తెలిపారు. శుక్రవారం మధ్యాహానికి 2వ యూనిట్‌ సర్వీసులోకి వచ్చిందన్నారు. 3,4,5 యూనిట్లు శుక్రవారం రాత్రికెల్లా సర్వీసులోకి వస్తాయని, 1వ యూనిట్‌ మాత్రం ఆలస్యంగా సర్వీసులకు వస్తాయని చెప్పారు.
 

Advertisement

పోల్

Advertisement