డోన్ నియోజకవర్గంలోని ప్యాపిలి మండలం జలదుర్గం పోలీసుస్టేషన్ పరిధిలోని బావిపల్లె గ్రామం వద్ద అక్రమంగా తవ్వకాలు చేపడుతున్న తెల్లసుద్ద గనులపై శుక్రవారం ఏడీఎంజీ అధికారులు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.
ఏడీఎంజీ అధికారుల ఆకస్మిక తనిఖీ
Mar 4 2017 12:43 AM | Updated on Sep 5 2017 5:06 AM
కర్నూలు (వైఎస్‌ఆర్ సర్కిల్): డోన్ నియోజకవర్గంలోని ప్యాపిలి మండలం జలదుర్గం పోలీసుస్టేషన్ పరిధిలోని బావిపల్లె గ్రామం వద్ద అక్రమంగా తవ్వకాలు చేపడుతున్న తెల్లసుద్ద గనులపై శుక్రవారం ఏడీఎంజీ అధికారులు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. భూగర్భగనుల శాఖ సహాయ సంచాలకులు వెంకటరెడ్డి ఆదేశాల మేరకు రాయల్టీ ఇన్‌స్పెక్టర్ నాగరాజు, సిబ్బంది ఈ దాడులు నిర్వహించారు. ముందుగా బావిపల్లె వద్ద చేపడుతున్న తెల్ల సుద్దగనుల వద్ద ఖనిజాన్ని తరలించేందుకు సిద్ధంగా ఉన్న రెండు టిప్పర్‌లతో పాటు, ట్రాక్టర్ లోడర్‌ను సీజ్ చేశారు. అదే విధంగా బనగానపల్లె నుంచి ప్యాపిలి వైపు రాయల్టీలు లేకుండా నాపరాయి ఖనిజాన్ని తరలిస్తున్న రెండు లారీలను కూడా సీజ్ చేశారు. సీజ్ చేసిన వాహనాలను జలదుర్గం పోలీసుస్టేషన్‌కు తరలించారు. డోన్ ప్రాంతంతో పాటు ఇతర ప్రాంతాలలో ఖనిజాలను అక్రమంగా తరలిస్తున్న వారి సమాచారాన్ని గుట్టుగా సేకరిస్తున్నట్లు సమాచారం.
Advertisement
Advertisement