అపురూప తాబేలు | a rare turtle in odisha | Sakshi
Sakshi News home page

అపురూప తాబేలు

Sep 2 2017 3:41 PM | Updated on Sep 17 2017 6:18 PM

అపురూప తాబేలు

అపురూప తాబేలు

చిత్రంలో కనిపిస్తున్న అపురూప తాబేలు రాష్ట్ర సచివాలయం పరాసరాల్లో తారసపడింది.

భువనేశ్వర్(ఒడిశా)‌: చిత్రంలో కనిపిస్తున్న అపురూప తాబేలు రాష్ట్ర సచివాలయం పరాసరాల్లో తారసపడింది. సచివాలయం గ్రిడ్‌ ప్రాంగణంలో తిరుగాడుతుండంగా సిబ్బంది గుర్తించారు. స్నేక్‌ హెల్ప్‌లైన్ వర్గాలకు సమాచారం అందజేశారు. ఈ వర్గం రంగంలోకి దిగి దీనిని సురక్షితంగా చేజిక్కించుకుంది.

ఈ జాతి తాబేళ్ల పూర్వపరాల కోసం ఎవరికీ అవగాహన లేనట్లు సిబ్బంది తెలిపారు. అరుదైన తాబేలు సచివాలయం ప్రాంగణానికి ఎలా చేరిందోనని ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. నగరం శివారులోని నందన్‌కానన్‌ జంతు ప్రదర్శనశాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement