వినుకొండ రూరల్ : మితిమీరిన వేగంతో ప్రయాణిస్తున్న ఓ లారీ వ్యక్తిని ఢీకొట్టడంతో తీవ్ర గాయాలపాలై మరణించిన సంఘటన పట్టణంలోని ఏనుగుపాలెం రోడ్డులో మంగళవారం చోటు చేసుకుంది.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
Dec 27 2016 10:05 PM | Updated on Apr 3 2019 7:53 PM
వినుకొండ రూరల్ : మితిమీరిన వేగంతో ప్రయాణిస్తున్న ఓ లారీ వ్యక్తిని ఢీకొట్టడంతో తీవ్ర గాయాలపాలై మరణించిన సంఘటన పట్టణంలోని ఏనుగుపాలెం రోడ్డులో మంగళవారం చోటు చేసుకుంది. పట్టణంలోని రైలుపేటకు చెందిన నంబూరి జీవానందం(75) రైల్వే గ్యాంగ్‌మెన్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఏనుగుపాలెం రోడ్డులోని కీర్తిహాలు వద్ద ప్రైవేటు వైద్యశాలలో చికిత్స కోసం రోడ్డుపై నడిచి వెళుతుండగా సుబాబుల్ లోడుతో వస్తున్న లారీ జీవానందంను ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న 108 సిబ్బంది క్షతగాత్రుడిని హుటాహుటినా వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అక్కడ మృతిచెందాడు.
Advertisement
Advertisement