గట్టుప్పల గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని కోరుతూ ఓ యువకుడు ఆత్మహత్యకు యత్నించాడు. నల్లగొండ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు
చండూరు: గట్టుప్పల గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని కోరుతూ ఓ యువకుడు ఆత్మహత్యకు యత్నించాడు. నల్లగొండ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు.. గట్టుప్పల గ్రామానికి చెందిన ఏర్పుల యూదయ్య బుధవారం ఉదయం స్థానికంగా నిర్వహిస్తున్న దీక్ష వద్దకు చేరుకున్నాడు. తొలుత గట్టుప్పలను మండలంగా ప్రకటించి ముసాయిదాలో ప్రకటించకపోవడాన్ని నిరసిస్తూ జై తెలంగాణ అంటూ ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు.
ఈ విషయం తెలుసుకుని వెంటనే అక్కడికి చేరుకున్న సీఐ రమేష్‌కుమార్ స్థానికులతో కలిసి మంటలు ఆర్పించి ఆస్పత్రికి తరలించారు. 30 శాతానికి పైగా కాలిపోయిన యూదయ్యను నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.