వైఎస్సార్‌ సీపీలో పలువురి చేరిక | 75 families joined in ysrcp, | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీలో పలువురి చేరిక

Mar 27 2017 8:49 PM | Updated on May 29 2018 4:37 PM

వైఎస్సార్‌ సీపీలో పలువురి చేరిక - Sakshi

వైఎస్సార్‌ సీపీలో పలువురి చేరిక

మండలంలోని బమ్మిడి గ్రామానికి చెందిన 75 కుటుంబాలు వైఎస్‌ఆర్‌సీపీలో చేరాయి.

కొత్తూరు: మండలంలోని బమ్మిడి గ్రామానికి చెందిన 75 కుటుంబాలు వైఎస్‌ఆర్‌సీపీలో చేరాయి. గ్రామానికి చెందిన వంబరవిల్లి శ్రీనివాసరావు, ఆర్‌.శిమ్మయ్య, వైరాగి, ఏ.సంజీవు, ఎస్‌.కృష్ణమూర్తి, ఏ.శిమ్మన్న, ఎల్‌.అప్పలనాయుడు, పి.లక్షణరావు తదితరులు ఆదివారం ఆదివారం వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి ఆధ్వర్యంలో పార్టీలో చేరారు.

ప్రజా సమస్యలు, ప్రత్యేక హోదా కోసం రాజీలేని పోరాటాలు చేస్తున్న పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై ఆకర్షితులమై పార్టీలో చేరినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామానికి చెందిన వి.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు సారిపల్లి ప్రజాదరావు, రైతు విభాగం జిల్లా నేత రేగేటి కన్నయ్య, వైద్యులు ఎం.తిరుపతిరావు. సంజీవరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement