709 తాత్కాలిక ఉద్యోగాలు | 709 out source jobs in water grid | Sakshi
Sakshi News home page

709 తాత్కాలిక ఉద్యోగాలు

Aug 18 2015 10:42 PM | Updated on Sep 3 2017 7:40 AM

తెలంగాణ తాగునీటి సరఫరా పథకం(వాటర్‌గ్రిడ్) నిర్మాణ బాధ్యతలను చేపట్టిన గ్రామీణ నీటి సరఫరా విభాగం(ఆర్‌డబ్ల్యుఎస్)లో తాత్కాలిక ఉద్యోగాలకు సర్కారు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.

హైదరాబాద్ సిటీ: తెలంగాణ తాగునీటి సరఫరా పథకం(వాటర్‌గ్రిడ్) నిర్మాణ బాధ్యతలను చేపట్టిన గ్రామీణ నీటి సరఫరా విభాగం(ఆర్‌డబ్ల్యుఎస్)లో తాత్కాలిక ఉద్యోగాలకు సర్కారు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ప్రాజెక్ట్‌ను సకాలంలో పూర్తి చేసేందుకు సిబ్బంది కొరత ఏర్పడిన నేపథ్యంలో తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీ చేపట్టాలని ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి మంగళవారం సర్క్యులర్ జారీచేశారు. ఆర్‌డబ్ల్యుఎస్‌లో ప్రస్తుతం ఖాళీగా ఉన్న 47 సీనియర్ అసిస్టెంట్ల స్థానాల్లో 47మంది జూనియర్ అసిస్టెంట్లను, వాటర్‌గ్రిడ్ ప్రాజెక్ట్ పనుల పర్యవేక్షణ నిమిత్తం కొత్తగా 662 మంది వర్క్ ఇన్‌స్పెక్టర్లను నియమించుకోవాలని పేర్కొన్నారు. ఈ మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆర్‌డబ్ల్యుఎస్ ఇంజినీర్ ఇన్ ఛీఫ్‌ను సర్కారు ఆదే శించింది.

ఉద్యోగాలకు అర్హతలు ఇలా..
ప్రభుత్వం జారీచేసిన ఔట్ సోర్సింగ్ నియమ నిబంధనల మేరకే జూనియర్ అసిస్టెంట్ నియామకాలు, వారి వేతనాలు ఉండాలని సర్క్యులర్‌లో స్పష్టం చేశారు. వర్క్ ఇన్‌స్పెక్టర్ల పోస్టుల భర్తీ విషయంలో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన నియామకం చేపట్టి, రోజువారీగా కన్సాలిడేటెడ్ వేతనం ఇవ్వాలని నిర్ణయించారు. మొత్తం 662 వర్క్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల్లో 636 పోస్టులకు సివిల్ ఇంజినీరింగ్ డిగ్రీ/డిప్లమో పూర్తి చేసిన వారు అర్హులు, మొత్తం పోస్టుల్లో సగం డిగ్రీ అభ్యర్థులకు, సగం పోస్టులు డిప్లమో అభ్యర్థులకు కేటాయించాలని ప్రభుత్వం ఆదేశించింది.

మరో 26పోస్టుల్లో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ కోర్సు చేసిన డిగ్రీ/డిప్లమో అభ్యర్థులకు కేటాయించారు. అభ్యర్థులు యూజీసీ గుర్తింపు కలిగిన ఏదేని యూనివర్సిటీ నుంచి సివిల్ ఇంజినీరింగ్‌లో బీఈ/బీటెక్ లేదా ఏఎంఐఈ కోర్సు పూర్తి చేసి ఉండాలి. ఈ ఉద్యోగాలకు 60ఏళ్ల వయస్సు దాటిన అభ్యర్థులను పరిగణనలోకి తీసుకోరు. బీటెక్ పూర్తి చేసిన అభ్యర్థులకు రోజువారీ వేతనం రూ.735 చొప్పున నెలలో 25రోజులకు 18,375 చెల్లిస్తారు. డిప్లమో అభ్యర్థులకు రోజుకు రూ.550 చొప్పున నెలలో 25రోజులకు కలిపి రూ.13,750 వేతనాన్ని చెల్లిస్తారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement