44 శాతం ఫిట్‌మెంట్ ఘనత కేసీఆర్‌దే | 44 percent credit for phitment Kcr | Sakshi
Sakshi News home page

44 శాతం ఫిట్‌మెంట్ ఘనత కేసీఆర్‌దే

Jul 12 2016 2:57 AM | Updated on Aug 9 2018 4:48 PM

44 శాతం ఫిట్‌మెంట్ ఘనత కేసీఆర్‌దే - Sakshi

44 శాతం ఫిట్‌మెంట్ ఘనత కేసీఆర్‌దే

ఆర్టీసీ చరిత్రలో కార్మికులకు 44శాతం ఫిట్‌మెంట్ ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి పేర్కొన్నారు.

ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి
దేవరకొండ :  ఆర్టీసీ చరి త్రలో కార్మికులకు 44శా తం ఫిట్‌మెంట్ ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం దేవరకొండ బ స్టాండ్ సమీపంలో జరిగిన టీఎంయూ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడా రు. గత పాలకుల వైఫల్యం వల్లే ఆర్టీసీ నష్టాల ఊబిలో కూరుకుపోయిందని,  లాభాల్లోకి తీసుకువచ్చేందుకు సీఎం కేసీఆర్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపా రు. అందులో భాగంగా ఇప్పటికే రూ.500 కోట్ల మేరకు నిధులు విడుదల చేశారని పేర్కొన్నారు. కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో టీఎంయూ గెలుపు కోసం కార్మికులు కృషి చేయాలని కోరారు.  

జెడ్పీ చైర్మన్ బాలునాయక్ మాట్లాడుతూ కార్మికుల పక్షాన పోరాడే టీఎంయూకు   పట్టం కట్టాలని కోరారు. ఎమ్మెల్యే రవీంద్రకుమార్ మాట్లాడుతూ కార్మికుల సమస్యల పరిష్కారంలో టీఎంయూ ముందంజలో నిలుస్తుందన్నారు. ఈ  సమావేశంలో జెడ్పీటీసీ సభ్యుడు ఆలంపల్లి నర్సిం హ, తేరా గోవర్ధన్‌రెడ్డి, పున్న వెంకటేశ్వర్లు, గాజుల ఆంజనేయులు, బం డారు బాలనర్సిం హ, బోరిగం భూపాల్, శి రందాసు కష్ణయ్య, బోయపల్లి శ్రీనివాస్‌గౌడ్, ముత్యాల సర్వ య్య, హన్మంతు వెంకటేష్‌గౌ డ్, ఆర్టీసీ టీఎం యూ నాయకులు నరేందర్, పీ.జే. రావు, కె.ఎన్.రెడ్డి,యా దయ్య, మోహన్‌లాల్,చంటి, పున్న శ్రీనివాసులు, దశరథం, ఆర్టీసీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement