పశ్చిమ రాయలసీమ (వైఎస్‌ఆర్, అనంతపురం, కర్నూలు జిల్లాలు) పట్టభద్ర, ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల తుదిపోరుకు 35 మంది అభ్యర్థులు సిద్ధమయ్యారు.
అనంతపురం అర్బన్ : పశ్చిమ రాయలసీమ (వైఎస్‌ఆర్, అనంతపురం, కర్నూలు జిల్లాలు) పట్టభద్ర, ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల తుదిపోరుకు 35 మంది అభ్యర్థులు సిద్ధమయ్యారు. నామినేషన్ల పరిశీలన తర్వాత పట్టభద్ర నియోజకవర్గం నుంచి 27 మంది, ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి 11 మంది మిగిలారు. వీరిలో గురువారం పట్టభద్ర అభ్యర్థులు ఇద్దరు, ఉపాధ్యాయ అభ్యర్థి ఒకరు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో పట్టభద్ర స్థానం నుంచి 25 మంది, ఉపాధ్యాయ స్థానం నుంచి పది మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ కోన శశిధర్ వెల్లడించారు. అభ్యర్థుల వివరాలిలా ఉన్నాయి.
పట్టభద్ర నియోజకర్గ అభ్యర్థుల వివరాలు