
క్రికెట్ తెచ్చిన తంటా..
తడ మండలం బాలకృష్ణపురకుప్పంలో మత్స్యకారుల మధ్య చెలరేగిన ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది.
తడ (నెల్లూరు జిల్లా) : తడ మండలం బాలకృష్ణపురకుప్పంలో మత్స్యకారుల మధ్య చెలరేగిన ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది. తడ పరిధిలోని భీములవారిపాలెం, బాలకృష్ణపురకుప్పం గ్రామస్థుల మధ్య గురువారం క్రికెట్ మ్యాచ్ జరిగింది. మ్యాచ్ సందర్భంగా వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మ్యాచ్ అనంతరం రెండు గ్రామాలకు చెందినవారు ఆట స్థలం నుంచి వెళ్లిపోయారు.
మళ్లీ స్థానిక వైన్ షాపు వద్ద ఇరు పక్షాల వారు గొడవకు దిగారు. ఈ ఘటనలో బాలక్రిష్ణపురకుప్పానికి చెందిన ముగ్గురు మత్స్యకారులకు గాయాలయ్యాయి. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గొడవ ప్రస్తుతం పోలీసు స్టేషన్‌కు చేరింది.