రైతుల రుణాలు ఏకకాలంలో మాఫీ చేసి కొత్త రుణాలు ఇవ్వాలని డిమాం డ్ చేస్తూ ఈనెల 28న అన్ని మండల, నియోజకవర్గ కేంద్రాల్లోని బ్యాంకుల ఎదుట ధర్నా నిర్వహించాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.
రుణమాఫీ కోసం 28న బ్యాంకుల ఎదుట ధర్నా
Jul 26 2016 12:16 AM | Updated on Oct 1 2018 1:21 PM
వరంగల్ : రైతుల రుణాలు ఏకకాలంలో మాఫీ చేసి కొత్త రుణాలు ఇవ్వాలని డిమాం డ్ చేస్తూ ఈనెల 28న అన్ని మండల, నియోజకవర్గ కేంద్రాల్లోని బ్యాంకుల ఎదుట ధర్నా నిర్వహించాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్ ఎన్నికల ముందు ఇచ్చిన అన్ని హామీలను విస్మరించిందని, రుణాలు మాఫీ చేయక పోవడంతో రైతులు అప్పులు దొరకక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
నేడు ప్రమాణ స్వీకారం
టీడీపీ అనుబంధ తెలుగురైతు జిల్లా కార్యవర్గ ప్రమాణ స్వీకారం మంగళవారం హన్మకొండలోని పార్టీ కార్యాలయంలో మధ్యాహ్నం 1 గంటకు ఉంటుందని సత్యనారాయణరావు తెలిపారు.
Advertisement
Advertisement