మండలంలోని ఇరుగు పొరుగు గ్రామాలైన పూదూడి, పాకవెల్లిలలో గత మూడు రోజుల్లో రెండు శిశు మరణాలు సంభవించాయి. మారుమూల లోతట్టు ప్రాంతంలో ఉన్న తమ గ్రామాలకు సమాచార వ్యవస్థ లేకపోవడం, రహదారి సదుపాయాలు మెరుగుపడకపోవడం ఇందుకు కారణమని అక్కడి గిరిజనులు వాపోతున్నారు. సోమవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో పూదేడులోని వంతల పార్వతి కుమారుడు గుక్కపట్టి ఏడ్చి చివరకు మరణించాడు.
-
మూడు రోజుల వ్యవధిలో ఇద్దరి మృతి
రాజవొమ్మంగి :
మండలంలోని ఇరుగు పొరుగు గ్రామాలైన పూదూడి, పాకవెల్లిలలో గత మూడు రోజుల్లో రెండు శిశు మరణాలు సంభవించాయి. మారుమూల లోతట్టు ప్రాంతంలో ఉన్న తమ గ్రామాలకు సమాచార వ్యవస్థ లేకపోవడం, రహదారి సదుపాయాలు మెరుగుపడకపోవడం ఇందుకు కారణమని అక్కడి గిరిజనులు వాపోతున్నారు. సోమవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో పూదేడులోని వంతల పార్వతి కుమారుడు గుక్కపట్టి ఏడ్చి చివరకు మరణించాడు. పార్వతికి రెండో కాన్పులో పుట్టిన ఆ బిడ్డ వయసు 45 రోజులు. అలాగే పాకవెల్తిలో భీంరెడ్డి లక్ష్మికి తొలి కాన్పులో జన్మించిన 45 రోజుల వయస్సు గల ఆడపిల్ల శనివారం మరణించింది. పాలు తాగుతూ ఈ శిశువు ఉక్కిరి బిక్కిరై మరణించిందని గ్రామస్తులు తెలిపారు. ఈ పిల్ల తల్లులిద్దరూ జడ్డంగి పీహెచ్‌సీలోనే పురుడు పోసుకున్నారు. పుట్టిన బిడ్డలకు సరైన వైద్య సదుపాయాలు ఇక్కడ అందుబాటులో లేకపోవడం వల్లే ఈ విధంగా మరణిస్తున్నారని సర్పంచ్ లోతా రామారావు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల రోడ్డు సరిగాలేక, సకాలంలో ఆసుపత్రికి వెళ్లలేక లోదొడ్డిలో ఇద్దరు, కేశవరంలో ఓ గర్భిణి ఇళ్ళవద్ద పురుడు పోసున్నారని తెలిపారు.