దుస్తులు ఉతికిన నీటితో వంట | 12 girl students ill in gangireddu dibba govt hostel | Sakshi
Sakshi News home page

దుస్తులు ఉతికిన నీటితో వంట

Mar 8 2016 2:59 PM | Updated on Nov 9 2018 4:44 PM

కలుషితాహారం తిని విద్యార్థినులు అస్వస్థతకు గురైన సంఘటన విజయవాడలోని గుణదల గంగిరెద్దుదిబ్బలో ఉన్న సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహంలో చోటుచేసుకుంది.

12 మంది విద్యార్థినులకు తీవ్ర అస్వస్థత

విజయవాడ(గుణదల): కలుషితాహారం తిని విద్యార్థినులు అస్వస్థతకు గురైన సంఘటన సోమవారం విజయవాడలోని గుణదల గంగిరెద్దుదిబ్బలో ఉన్న సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహంలో చోటుచేసుకుంది. విద్యార్థునులు తెలిపిన వివరాల ప్రకారం... వసతి గృహంలో సుమారు 50 మంది విద్యార్థునులు ఉన్నారు. హాస్టల్‌లో సోమవారం వంటమనిషి స్వర్ణ గైర్హాజరు కావడంతో ఆమె కూతురు వచ్చి వంట చేసింది.

విద్యార్థినులు దుస్తులు ఉతికిన సర్ఫ్ నీటితోనే పప్పు కడిగి.. మళ్లీ అదే నీటితో వంట చేయడంతో వాటిని తిన్న విద్యార్థినుల్లో 12 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కడుపులో నొప్పి, నాలుకమంట, వాంతులు, విరేచనాలు అయ్యాయి. ఈ సమాచారాన్ని బాలికల్లో కొందరు ఓ విద్యార్థి సంఘ ప్రతినిధులకు తెలిపారు. వారు విద్యార్థులను సకాలంలో ప్రభుత్వాస్పత్రికి తరలించి వైద్యం అందించడంతో ప్రమాదం తప్పింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement