‘పది’ పరీక్షల వేళ ముందస్తు గందరగోళం


  • అదే సమయంలో సమ్మేటివ్‌–3 పరీక్షలు 

  • 14 నుంచి ప్రారంభం ß సిలబస్‌ పూర్తి కాకుండానే నిర్వహణ

  • విద్యార్థులు నష్టపోతారని తల్లిదండ్రులు ఆందోళన 

  •  

    లక్షలాది మంది విద్యార్థులు రాసే తుది పరీక్షల నిర్వహణపై గందరగోళం చోటు చేసుకుంటుంది. పరీక్షల నిర్వహణలో రాష్ట్ర విద్య పరిశోధన శిక్షణా మండలి(ఎస్‌సీఈఆర్‌టీ)కి ముందస్తు ప్రణాళిక లేక పోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తుతుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒక వైపు పది పరీక్షలు.. మరో వైపు ప్రాథమి, ప్రాథమికోన్నత పాఠశాలల విద్యార్థులకు(ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు) సమ్మేటివ్‌–3 పరీక్షలు ఒకే సమయంలో నిర్వహించనున్నారు. ఇప్పటికే ఎస్‌సీఈఆర్‌టీ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయుల్లో గందరగోళం చోటు చేసుకుంది. 

    – రాయవరం

     

    కీలకమైన రెండు పరీక్షలను ఒకేసారి నిర్వహించడం వలన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ఉపాధ్యాయ సంఘాలు పేర్కొంటున్నాయి. ఫిబ్రవరి నెలాఖరు నాటికి ప్రాథమిక, ప్రాథమికోన్నత విద్యార్థులకు సంబంధించిన సిలబస్‌ను పూర్తి చేయాలి. కొన్ని పాఠశాలలు సిలబస్‌ పూర్తి చేయడంలో వెనుకబడి ఉన్నాయి. మార్చి మొదటి వారం కల్లా సిలబస్‌ పూర్తవుతుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. సిలబస్‌ పూర్తయిన అనంతరం రివిజ¯ŒSకు అవకాశం లేకుండా వెంటనే పరీక్షలు నిర్వహించడంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కనీసం పక్షం రోజులు రివిజ¯ŒS లేకుండా పరీక్షలు నిర్వహిస్తే అంతిమంగా విద్యార్థులు నష్టపోతారని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మార్చి 14 నుంచి సమ్మేటివ్‌–3, మార్చి 17 నుంచి పది పబ్లిక్‌ పరీక్షలు జరగనున్నాయి. ఒకవైపు ఇప్పటికే ఉన్నత పాఠశాలల అంతా పది పబ్లిక్‌ పరీక్షల నిర్వహణ విధుల్లోకి వెళ్లాల్సి ఉంటుంది. అలాగే ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులను కూడా పది పరీక్షలకు ఇన్విజిలేటర్లుగా నియమిస్తారు. వీరంతా పది పరీక్షలకు వెళితే అరకొరగా ఉన్న ఉపాధ్యాయులతో సమ్మేటివ్‌–3 పరీక్షలను పక్కాగా నిర్వహించడం సాధ్యమేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

    విద్యార్థుల రాక అనుమానమే..

    ఒకవైపు సమ్మేటివ్‌ పరీక్షలు పూర్తి కాగానే వెనకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం సూచించింది. పిల్లల పరీక్షలు పూర్తికాగానే సెలవుల మూడ్‌లోకి వెళ్లిపోతారు. అలాంటప్పుడు ప్రత్యేక శిక్షణకు ఎంతమంది వస్తారు? ఇది ఆచరణ సాధ్యమా?కాదా? అనేది ఉపాధ్యాయ సంఘాలతో చర్చించకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారనే విమర్శలు విన్పిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో ఉన్న ఇబ్బందుల దృష్ట్యా తొలుత ఏదైనా జిల్లాలో ప్రయోగాత్మక పరిశీలన జరిపి వచ్చే విద్యా సంవత్సరం నుంచి పూర్తి స్థాయిలో ముందస్తు పరీక్షలు, అనంతరం ప్రత్యేక శిక్షణకు చర్యలు తీసుకుంటే బాగుండేదని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. 

     

    పరీక్షల షెడ్యూల్‌ ఇదీ

    ఈ నెల 14 నుంచి 17 వరకు ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ నెల 15 నుంచి 18వ తేదీ వరకు ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు పరీక్షలు ఉంటాయి. పది పరీక్షలు మాత్రం ఈ నెల 17న ప్రారంభమై ఏప్రిల్‌ ఒకటో తేదీతో ముగుస్తాయి. ఈ నెల 28 నుంచి ఏప్రిల్‌ 22 వరకు వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. జిల్లా వ్యాప్తంగా 3.80 లక్షల మంది విద్యార్థులు సమ్మేటివ్‌–3 పరీక్షలు రాయనున్నారు. ఆరు నుంచి 9తరగతుల విద్యార్థులకు పరీక్ష పేపర్లను ఏరోజుకారోజు ఎమ్మార్సీ కేంద్రం నుంచి సరఫరా చేస్తారు. 8వ తరగతి పరీక్ష పేపర్లు మాత్రం మండల స్థాయిలో మూల్యాంకనం చేపడతారు. 

     
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top